సీతాఫలం ఒక సీజనల్ ఫ్రూట్. రుచికి తియ్యగా ఉండే ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సహజంగా ఈ పండు మనకు శీతాకాలంలో లభిస్తుంది. కానీ, చలికాలం మొదలు కాకముందే.. మార్కెట్లో ఈ పండ్లు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి, ఈ పండును ప్రతిరోజూ ఒకటి తింటే.. మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా...
సీతాఫలంలో పోషకాలు..
సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు శరీరానికి అవసరయ్యే శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
DID YOU KNOW ?
విటమిన్ సి
సీతాఫలంలో ఉన్న విటమిన్ సి, ఒక నారింజలో ఉన్న విటమిన్ C కంటే ఎక్కువగా ఉంటుంది.
24
రోగనిరోధక శక్తిని పెంచే సీతాఫలం..
సీతాఫలంలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది. దీని వల్ల మనల్ని మనం అనేక వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా చలి, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో మేలు చేస్తుంది.
జీర్ణక్రియకు మేలు
సీతాఫలంలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తహీనత నివారణ
రక్తహీనత (Anemia) తో బాధపడేవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులోని ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి, అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది.
34
కంటిచూపు మెరుగుపరిచే సీతాఫలం..
బీపీ నియంత్రణ
అధిక రక్తపోటుతో బాధపడేవారికి సీతాఫలం మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కంటి ఆరోగ్యం
సీతాఫలంలో విటమిన్ A, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి కణజాలాన్ని రక్షించి, వయస్సుతో వచ్చే చూపు సమస్యలను నివారించడంలో ఇది ఉపయోగకరం.
సీతాఫలంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ పండు చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు తగ్గాలి అనుకునేవారి డైట్‌లో చేర్చుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తొందరగా కలగదు. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైనల్ గా...
సీతాఫలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక సహజ వైద్యంలా పనిచేస్తుంది. ఈ పండును మనం మితంగా తింటే శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి.