Cholesterol :శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే కొన్ని రకాల కూరగాయలతో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని రకాల కూరగాయలు బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
26
బ్రోకలీ
బ్రోకలి కూడా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో ల్యూటిన్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతినకుండా చేసి శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
36
బెండకాయ
బెండకాయ మంచి హెల్తీ ఫుడ్. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీంరలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
వంకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది.అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
56
క్యారెట్
క్యారెట్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు క్యారెట్ ను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
66
బచ్చలికూర
బచ్చలికూరలో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి సహాయపడతాయి.