Onions: వీళ్లు మాత్రం ఉల్లిగడ్డల్ని తినకూడదు

Published : Sep 13, 2025, 11:28 AM IST

Onions: ఉల్లిగడ్డలేని కూర అస్సలు ఉండదు. వీటి వల్ల కూరలో మంచి గ్రేవీ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ వీటిని కొంతమంది మాత్రం తినకూడదు. 

PREV
14
ఉల్లిపాయల్ని ఎవరు తినకూడదు

మన వంటింట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఉల్లిగడ్డలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వీటిని ప్రతి కూరలో వేస్తాం. నిజానికి ఉల్లిపాయల వల్ల కూర టేస్టీ అవుతుంది. ఇదొక్కటే కాదు ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో ఫైబర్, సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఎముకల్ని హెల్తీగా ఉంచుతాయి. ఉల్లిగడ్డలను తినడం వల్ల మన చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిగడ్డల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా దీనిని కొంతమంది మాత్రం తినకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
గ్యాస్, కడుపు ఉబ్బరం

గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి వారు ఉల్లిపాయల్ని అస్సలు తినకూడదు. ఉల్లిపాయల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు ఈ సమస్యల్ని మరింత పెంచుతాయి. భోజనం చేసిన తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరంగా ఉంటే ఉల్లిపాయల్ని అస్సలు తినకండి.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు

గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఉల్లిపాయల్ని తినకపోవడమే మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

34
తక్కువ రక్తపోటు

ఎక్కువ రక్తపోటే కాదు తక్కువ రక్తపోటు కూడా డేంజరే. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడాఉంది. అయితే రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయల్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది.

44
ప్రకోప ప్రేగు సిండ్రోమ్

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు కూడా ఉల్లిపాయల్ని తినకూడదు. ఎందుకంటే ఉల్లి పాయల్లో ఉండే కొన్ని లక్షణాలు ఈ సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు హోమియోపతి మందులను వాడేవారు కూడా ఉల్లిపాయల్ని తినకూడదు. దీనివల్ల మందుల ప్రభావం తగ్గుతుందట. కొంతమందికి ఉల్లిపాయలకు అలెర్జీ కూడా ఉంటుంది. ఇలాంటి వారు కూడా ఉల్లిపాయల్ని తినకూడదు

Read more Photos on
click me!

Recommended Stories