అమ్మాయిలూ... ఎలుకలున్నాయని సొంతిల్లు తగలబెట్టుకుంటామంటే ఎలా..!

Published : Nov 20, 2025, 10:46 AM IST

పెళ్లే వద్దంటే ఎలా అమ్మాయిలూ..? మనిషికోసం పని కాని పని కోసం మనిషి కాదు… ఈ విషయాన్ని నేటితరం చదువుకున్న అమ్మాయిలు గుర్తిస్తే మంచిది. వైవాహిక బంధంలో మహిళలకు ఇబ్బందులుంటాయి… కానీ ఎలుకలు ఉన్నాయని ఇంటినే తగలబెట్టుకుంటామంటే ఎలా..!

PREV
15
బతకడం కోసమే ఉద్యోగం... అదే జీవితం కాదు

ఐఐటీ హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో ఎక్కువ మంది అమ్మాయిలు "పెళ్ళొద్దు "అన్నారట!

వారే కాదు .. ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్న అమ్మాయిలు , అబ్బాయిలు.. వారి తలితండ్రులు గ్రహించాల్సిన కొన్ని అంశాలు.

1 . బతకడం కోసం ఉద్యోగం...ఉద్యోగం కోసం బతికితే ఎలా ?

మీరు కంపెనీ బానిసలుగా పదేళ్లు .. ఇరవై ఏళ్ళు బతికినా ... మీ పనిని తక్కువ జీతానికి ఇంకొకరు చేస్తారని అనుకొంటే లేదా కృతిమ మేథ మీ పనిచేసే అవకాశముంటే... ఒక్క రోజులో ఆ కంపెనీ మిమల్ని తీసేయడానికి వెనుకాడదు. కంపెనీ కూలీగా వెట్టి చాకిరీ కోసమేనా మీరు పుట్టింది. గుర్రం ముందా బండి ముందా ?

25
అమ్మాయిలూ.. మీరైమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా

2 . మీరు భూమిపైకి వచ్చారు అంటే.. మీ అమ్మా- నాన్న.. వారి అమ్మా నాన్న .. ఆలా మీ ముందు.. కోటి తరాలు పెళ్లి చేసుకొన్నారు, పిల్లల్ని కన్నారు కాబట్టే. మీరు ఆకాశం నుండి ఊడి పడలేదు.

వ్యక్తిగతంగా ఎక్కడో ఒకరో ఇద్దరో నేను పెళ్లి చేసుకోను అనడం వేరు. విషపూరిత ప్రచారాలకు లొంగి మూకుమ్మడిగా పెద్దపెట్టున ఎక్కువ మంది పెళ్ళొద్దు అనడం వేరు.

మీరు పొద్దున్న వాడే టూత్ బ్రష్ మొదలు అన్నీ సమాజం నుండి వచ్చినవే. అంతెందుకు మీరు చదువుతున్న ఐఐటీలు ప్రజలు కట్టిన పన్నులతో నడుస్తున్నవే.

సామజిక బాధ్యత అనేది ఒకటుంది. గుర్తుంచుకోండి.

౩. కాలం మారింది. కాలంతో పాటే కొన్ని పద్ధతులు కూడా మారాలి. మన దేశంలో వివాహ, కుటుంబ వ్యవస్థలు లింగ సమానత్వం దిశగా మారాలి.

మారుతున్నాయి.

ఇంకా మారాలి.

సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకోవాలి.

ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టుకోకూడదు.

35
అండాన్ని దాచి పిల్లల్ని కనడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

4 .స్త్రీ యుక్త వయస్సులోనే తన అండాన్ని తీసి ఆసుపత్రుల్లో క్రయో పద్ధతుల్లో నిల్వయుంచుకోవడం అనేది స్టార్ ఆసుపత్రుల్ని మేపడానికే పనికొస్తుంది. గిని పందులుగా మారొద్దు. హార్మోన్ మార్పులు అండం ఉబకడం లాంటి సవాలక్ష సమస్యలు. మీ ఆరోగ్యం, ఆలా పుట్టే పిల్లల ఆరోగ్యం నాశనం అయ్యే అవకాశం ఎక్కువ. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న టెక్నాలజీని నమ్మితే ఆస్తులు ఆరోగ్యం హుష్ కాకి.

45
మీకు తోడుండేది మనుషులే... ఉద్యోగాలు కావు

5 . సాఫ్ట్వేర్ స్వర్ణ యుగం ముగిసింది . 1997 నుండి మొన్నటి దాక పెద్ద ఎత్తున అమెరికా కి వెళ్లి అక్కడ ఉద్యోగం చేసే అవకాశం ఉండేది. అమెరికాలో ఓపిటి తీసేస్తున్నారు. ఉన్నత విద్య పేరుతొ అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయడం కుదరదు. వీసా సిస్టం లో మార్పులు కూడా వస్తున్నాయి. అంత సులభంగా వీసా రాదు. వచ్చినా ఒకటి రెండేళ్లే. అటు పై తిరిగి రావాల్సిందే. గత సంవత్సరమే యాభై శాతం ఐఐటీ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు . అమెరికా కు వెళ్లిన వారిలో కొంత మంది హోటల్స్ లో పని చేసే ఉద్యోగం చేస్తున్నారు. పదేళ్ల సీనియారిటీ ఉన్న ఐఐటీ వారు కూడా బెంచ్ పై ఉన్నారు.

ఒక పక్క కృతిమ మేథ ఉద్యోగాలను తినేస్తోంది.

రానున్నది కష్ట కాలం .

మనిషికి మనిషి అండగా ఉండాలి .

ప్రస్తుతానికి మీకు మీ అమ్మా నాన్న అండగా ఉన్నారు . మీరు పెళ్ళొద్దు కుటుంబం వద్దు అంటే మరో ఇరవై ఏళ్లకు?

మీ అమ్మానాన్న వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతే ?

అటుపై?

మనుషులు మనుషుల్లా బతకాలి .

డీప్ స్టేట్ గాళ్ళ , ఫార్మాసురుల వలలో చిక్కి ఇంటిని ఒంటిని గుల్ల చేసుకోవద్దు .

55
మీకు సూట్ అయ్యే ఒక్క వ్యక్తి దొరకడా అమ్మాయిలూ..!

6 . చివరిగా ఒక్క మాట . జీవితం లో మీకు సూట్ అయ్యే ఒక్క వ్యక్తి దొరకడా? ఒక వ్యక్తితో వ్యవహరించలేని మీరు రేపు ఉద్యోగాలు ఎలా చేస్తారు ? ఆఫీస్ లో నలుగురితో ఎలా వ్యవహరిస్తారు? మీ చదువులు మీకు కొలాబరేషన్ స్కిల్ నేర్పలేదా ?

Read more Photos on
click me!

Recommended Stories