Alcohol: విస్కీని పెగ్స్‌లో కొలుస్తారనే విషయం తెలిసిందే. అయితే మద్యం కొలమానానికి పెగ్ అనే పదాన్నే ఎందుకు ఉపయోగిస్తారు.? అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది. సేఫ్ లిమిట్ అంటే ఏంటి.?లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఉపయోగిస్తున్న ఈ పెగ్ అనే పదం నిజానికి భారత్‌కి చెందింది కాదు. డెన్మార్క్ భాషలో ఉన్న “paegl” అనే పదం నుంచి ఇది వచ్చింది. ఆ కాలంలో ద్రవ పదార్థాలను కొలిచే ఒక ప్రమాణం పేరు అది. కాలక్రమేణా ఆ పదం యూరప్ నుంచి ఇతర దేశాలకు వచ్చింది. భారత్, నేపాల్‌లలో అది మద్యం కొలతగా స్థిరపడిపోయింది.
25
ఎందుకు మద్యం పెగ్‌లోనే కొలుస్తారు?
మద్యం తాగే గ్లాస్ ఎంత పరిమాణంతో ఉన్నా అందులో పోసే మద్యానికి మాత్రం ఒకటే కొలత ఉంటుంది. అందుకే మద్యాన్ని పెగ్‌ల రూపంలోనే తీసుకుంటారు.
* 30 ml – చిన్న పెగ్
* 60 ml – పెద్ద పెగ్‌లను సాధారణంగా వాడుతుంటారు.
35
సేఫ్ లిమిట్ అంటే ఏంటి.?
మన శరీరం ఒకేసారి మద్యం జీర్ణం చేసి రసాయనాలను బ్రేక్ చేయాలి. అయితే ఇలా చేయాలంటే నిర్ణీత పరిమాణం మద్యాన్నే తీసుకోవాలి. 30 ml లాంటి చిన్న పరిమాణం శరీరానికి భారం లేకుండా ప్రాసెస్ చేయగలదు.
లివర్‌పై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న పెగ్‌ను సేఫ్ క్వాంటిటీగా చెబుతుంటారు. అందుకే కొందరు వైద్య నిపుణులు సైతం 30 ml చాలా మందికి తట్టుకునే పరిమాణమని చెబుతారు. అయితే ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా మద్యపానం ఆరోగ్యానికి కచ్చితంగా హాని చేస్తుంది.
ఎక్కువ శాతం మద్యం బాటిల్స్ 750 mlలో ఉంటాయి. 30 ml లేదా 60 ml పెగ్‌తో ఫుల్ బాటిల్‌లో ఎన్ని పెగ్గులు వస్తాయన్న విషయం బార్‌లలో సర్వర్లకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది బార్‌లు నడిపించే వారికి ఈజీ బిజినెస్ మోడల్‌గా ఉంటుంది. ఉదాహరణకు 750 ml బాటిల్ → 30 ml పెగ్‌లు → 25 సర్వింగ్స్ వస్తాయి. ఇలా లెక్క కట్టడం సులభమవుతుంది.
55
ప్రపంచమంతా 30 ml ఎందుకు స్టాండర్డ్?
ప్రపంచవ్యాప్తంగా మద్యం కొలమానం 1 ounce (ఔన్స్). 1 ounce = సుమారు 29.57 ml. అంటే మన దేశంలో చిన్న పెగ్ (30 ml) దాదాపు అంతర్జాతీయ ప్రమాణం సైజుకే సమానం. ఇలా మద్యాన్ని కొలిచే విధానంలో కూడా ఇంత విషయం ఉందన్నమాట.