
ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు !
అదే పని.. రెండో వ్యక్తి చేస్తే ఒప్పవుతుందా ?
రెండో వ్యక్తిదీ తప్పవుతుంది.
ఒకటోవ్యక్తి చేస్తున్నాడు కాబట్టి రెండో వ్యక్తిది ఒప్పయిపోదు !
అబ్బాయిలు తాగుతున్నారు .. స్మోక్ చేస్తున్నారు .. చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు ..
సమాజం వారిని ఏమీ అనకుండా ... ఆలా చేసే మహిళను మాత్రం తప్పు పడుతోంది.
"ఆధునిక మహిళ తనకిష్టమయితే తాగొచ్చు .. స్మోక్ చేయొచ్చు . తిరగవచ్చు .. తన లైఫ్ తన ఇష్టం. అడగడానికి నీవెవరు? అడిగితే డబల్ స్టాండర్డ్ " లాంటి వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
దీని చేత ప్రభావితమయ్యి యువ మహిళలలో కొంత మంది ఇదే దారి పడుతున్నారు.
ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది.
ఈ అంశం పైనే ఈ పోస్ట్.
"వాడు మగ మహారాజు... ఏమైనా చేస్తాడు. తప్పు లేదు. ఆడదిగా పుట్టినందుకు నీవే జాగ్రత్తగా ఉండాలి. రూల్స్ .. నీతులు .. నియమాలు .. అన్నీ అమ్మాయిలకే" .. ఇలాంటి వాదనలు నూటికి నూరు శాతం పురుషాధిక్యం నుంచి వచ్చినవి.
ఇలాంటి వాదనలను బండకేసి బాదాలి.
పురుషాధిక్యత వేట, ఆహార సేకరణ వ్యవస్థలో .. అంటే పాతరాతి యుగం లో పుట్టింది .
దీనికి ఎప్పుడో కాలం చెల్లింది. రోబో యుగంలో ఇలాంటి ఆలోచనలు చెల్లవు.
తప్పులెవరు చేసినా తప్పే .
మద్యం వ్యాపారులు (లిక్కర్ , పబ్ , బార్ అండ్ ఫైన్ డైనింగ్), టొబాకో వ్యాపారులు, గంజాయి మాఫియా, రబ్బరు తొడుగులు, లైంగిక టాయ్స్ వ్యాపారులు , ఫార్మా.. స్టార్ ఆసుపత్రి వారు .. తమ లాభాలను డబల్ చేసుకోవడానికి మహిళా అభ్యుదయం పేరుతొ విష ప్రచారం చేస్తున్నారు.
కోట్లాది మంది యువతులను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అందరికీ వాస్తవాలను అందించేందుకు మహిళలపై ఫోకస్ తో ఈ పోస్ట్.
A. ఫలానా నటుడు గొప్ప యాక్టర్
B. భూమి గుండ్రంగా ఉంది.
ఈ రెండు వాక్యాలలో.. అభిప్రాయం ఏది ?
మొదటిది .
ఎవరు గొప్ప నటుడు.. అనేది వ్యక్తిగత అభిప్రాయం .
భూమి గుండ్రంగా ఉందనేది నిరూపితమయిన సత్యం .
ఇందులో చర్చించేందుకు ఏమీ లేదు .
మాటల్లేవ్ .. మాట్లాడుకోడాలు లేవు
సైన్స్ ను కాదంటే నష్టపోయేది మనమే.
ఈ పోస్ట్ లో నేను కింద ఇచ్చిన అంశాలన్నీ ప్రూవన్ సైన్స్ .
విస్మరిస్తే మనకే నష్టం
1 . ప్రేమ :
ఒక అబ్బాయి- అమ్మాయి ప్రేమలో పడ్డారు.
ఎవరిది ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్?
మహిళల శరీరం.. ఎక్కువ ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది.
ఇది లవ్ హార్మోన్ .
దీని వల్ల బాండింగ్ .. అటాచ్మెంట్ వస్తుంది.
ప్రియుడు/భర్త .. బిడ్డ తో బంధం ఏర్పరుస్తుంది.
అందుకే "తల్లి ప్రేమ "అన్నారు.
తల్లి తన ప్రాణానికంటే బిడ్డ ప్రాణానికే ఎక్కువ విలువనిస్తుంది .. కారణం ఆక్సిటోసిన్ .
మగాడు క్యాజువల్ గా ప్రేమించవచ్చు.
శారీరక సుఖం కోసం ప్రేమ నటించవచ్చు.
తన శరీర నిర్మాణం వల్ల మహిళ... తాను ప్రేమించిన వ్యక్తి తో తీవ్ర భావోద్వేగ సంభంధం ఏర్పరుచుకొంటుంది. ఒక వేళ క్యాజువల్ గా రిలేషన్ స్టార్ట్ చేసినా తనకు తెలియకుండానే ఎమోషనల్గా పెనవేసుకొని పోతుంది.
ఇది బలహీనత కాదు... బలం.
మనిషికి ఉండాల్సిన లక్షణం .
మహిళలో ఇది ఎక్కువ ఉందంటే .. మహిళలు మేలు రకం మనుషులు .
2. దేవుడు/ప్రకృతి స్త్రీ పక్షపాతులు. ఇది పచ్చి నిజం.
ఒక్కసారి ప్రేమిస్తే అమ్మాయి డీప్ గా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే అమ్మాయి ప్రేమ లో పడేముందు.. ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఒకవేళ రిలేషన్ చెడిపోయి బ్రేకప్ దాక వస్తే ఎక్కువ స్ట్రెస్ కు గురయ్యేది అమ్మాయి.
దీనికి కారణం ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్.
మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.
దీని వల్ల ఎక్కువ ఎమోషన్ . ఎక్కువ సెన్సిటివిటి..
విడిపోవాల్సి వస్తే ఎక్కువ స్ట్రెస్ .
అంటే ప్రేమ గాఢత.. అమ్మాయిల్లో ఎక్కువ .. విడిపోవాల్సి వస్తే స్ట్రెస్ కూడా .
౩. పురుషుడి తో పోలిస్తే మహిళ హిప్పోక్యాంపస్ పెద్దది .
ఎమోషనల్ ప్రాసెసింగ్, మెమరీ కి సంభందించిన మెదడు భాగం హిప్పోక్యాంపస్ .
అందుకే మహిళల్లో ఎక్కువ ఎమోషన్ .
గాయాన్ని అంత సులభంగా మరచి పోలేరు ...
ఒక పోలీస్ ఉన్నతాధికారి చాలా కాలం క్రితం నక్సల్స్ కాల్పుల్లో మరణించారు.
వారి కుటుంబం తో నాకు సాన్నిహిత్యం ఉంది .
కొడుకు మరణించడం తండ్రిని బాధించింది. కానీ కొంత మేర గాయాన్ని కాలం మాన్పింది.
కానీ ఆ తల్లి .. పాపం ముప్పై ఏళ్లయినా ఇప్పటికీ అదే శోకంలో . అనుక్షణం అదే బాధలో .
ఇది రాస్తుంటే నాకు రజనీకాంత్, రమ్యకృష్ణ సినిమా గుర్తుకువస్తోంది . సినిమా పేరు నరసింహ అనుకొంటా !
అమ్మాయిలూ ! మీరు ఎమోషనల్ అని చెప్పి మిమ్మల్నిమానసికంగా బలహీన పరచడం లేదు.
శరీర ధర్మం గురించి చెబుతున్నా..
ప్రేమ పేరుతో గాలం వేసే వెధవలకు కరువు లేదు .
మీ శరీరం .. మీ భవిషత్తు .
ఒకటికి పది సార్లు ఆలోచించండి .
మీది ఫెవికాల్ బంధం .
మంచి అయితే హ్యాప్పీస్. కానీ చెడుకు అతుక్కొని పొతే ?
ఎమోషనల్ turmoil .
అవసరమా ?
కార్టిజాల్ బాధలు అవసరమా ?
మిమల్ని మీరూ అర్థం చేసుకొన్న తరువాత .. మీకు ఎలాంటి వ్యక్తి తో కంపాటిబిలిటీ ఉంటుందో అర్థం చేసుకొన్న తరువాత .. అంటే మీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే మెదడు ముందు భాగం డెవలప్ అయ్యాక . అంటే 23 - 25 ఏళ్లకు ప్రేమ తప్పుకాదు.
అందుకు మీ పేరెంట్స్ సమ్మతి ఉండదా ?
ఆలోచించండి .
సంవత్సరం వాడి పడేసే డ్రెస్ కొనాలంటే పేరెంట్స్ ను సేల్స్ మాన్ ను అడుగుతారు. జీవిత సహవర్తి విషయం లో రహస్యమా ? వారి mature advice wisdom వద్దా?
Why dont you involve them ? Just think
మీ కన్నా మీ తల్లితండ్రి .. మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు .
అవునా ? కాదా ?
ఎక్కడో ఒక నెగటివ్ క్యారెక్టర్ ను చూపి, మీ పేరెంట్స్ ను మిమ్మల్ని విడకొట్టే కుట్రలకు లొంగుతారా ?
అమ్మయిలూ.. రాత్రి పడుకున్నప్పుడు .. ఒక సారి .. నాన్న గురించి ఆలోచించండి .
ఎన్ని కష్టాలు పడ్డాడు .. పడుతున్నాడు .
ఒక రోజైనా కన్నీరు పెట్టాడా ?
ప్రతి ఫలం ఆశించాడా?
నాన్న గుండెలోతుల్లోకి తొంగి చూడు తల్లీ !
ముక్కోపి .. నిజమే .. కానీ బోళాశంకరుడు . అది అర్థం కాకపోతే ఎలా అమ్మా!
మీ లైఫ్ లో నిజమయిన హీరో.. అయన కాకపోతే ఇంకెవరు ?
అయన ఫోటో గోడపై వేలాడే సమయంలో కాదు .
నేడే నాన్న నీకు అర్థం కావాలి .
4. "పెళ్ళొద్దు .. పిల్లలొద్దు ..ఇదే ఆధునికత "అని మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి .
దీని వెనుక మిలియన్ డాలర్స్ పెట్టుబడి ఉంది.
కుట్ర ఉంది .. కుతంత్రం ఉంది .
మీ జీవితం .. మీ ఇష్టం .. నిజమే .. కానీ
పెర్మనెంట్ బాండింగ్ భార్య - భర్త ... పిలల్లు .. ఇవి మిస్ అయితే మీ శరీరం లో ఆక్సిటోసిన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాదు. అలాగే ఈస్ట్రోజెన్ కూడా.
అంటే చేజేతులారా .. పొందాల్సిన ఆనందాన్ని మీరే కాలదన్నుకొన్నట్టు.
మహిళ గా మాతృత్వం .. మీ హక్కు ..
మీకు మాత్రమే సాధ్యమయ్యే పని .
ప్రకృతి / దేవుడు మీ పట్ల పాజిటివ్ వివక్షత చూపింది .
మగాడికి ఆ అవకాశం లేదు .
అందుకే మగాడికి.. ఎక్కువ గుండెపోట్లు .. మెదడు పోట్లు..
ఆక్సిటోసిన్ , ఈస్ట్రోజెన్ తో , మాతృత్వంతో ... ప్రకృతి మిమల్ని చల్లగా చూసింది.
హక్కుల పేరుతొ మీకు మాత్రమే దక్కిన వరాన్ని మీరే కాదనుకొంటే ఎలా ?
ఇద్దరు మహిళల్ని తీసుకొందాము. ఇద్దరి వయస్సు ఒకటే .. 33 అనుకొందాము .
ఒకామెకు పెళ్లయ్యింది ... పిల్లలు .
ఇంకో ఆమె పెళ్లి వద్దనుకొంది.
ఇద్దర్నీ తీసుకొని వెళ్లి కంప్లీట్ హెల్త్ చెక్ చేద్దాము .
ఇద్దరు కాదు .
ఇలా లక్ష మందికి టెస్ట్ చేద్దాము .
ఎవరి హెల్త్ ఎలా ఉందొ చూద్దాము .
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళ్లడం న్యాయమా ?
మహిళకు ఎక్కువ డోపమైన్ ఉత్పత్తి అవుతుంది వాసోప్రెస్సిన్ కూడా . అంటే మహిళకు deeper ఎమోషనల్ ఇంటిమసీ .
బయాలజికల్ నిజాలను దాచి .. మీ అనుకూలతను ప్రతికూలతగా మార్చే కుట్రల పట్ల జాగ్రత్త.
ఇలా చెబుతున్నాను అంటే .. మగాడి దౌష్టికాలకు గురై విధిలేక విడాకులు తీసుకొన్న మహిళలకు, సింగిల్ పేరెంట్ గా ఉన్న మహిళలకు, పిల్లలు కనలేని మహిళలకు వ్యతిరేకం కాదు. ప్రతికూలతలు నడుమ బతుకు పోరు చేస్తున్న వారికి వందనాలు.
5. మద్యం :
ఆరోగ్యానికి హానికరం .
మహిళకు ఇంకా ఎక్కువ హానికరం .
మద్యం వ్యాపారుల బ్రెయిన్ వాషింగ్.. దాటి నిజాలను తెలుసుకోండి.
మహిళ శరీరం లో ఎక్కువ ఫాట్ ఉంటుంది. ఉండాలి కూడా. (అందుకే మహిళ పాలిచ్చే తల్లి అయ్యింది).
దీని వల్ల మద్యం తీసుకున్నప్పుడు పురుషుడితో పోలిస్తే మహిళ బ్లడ్ లో ఎక్కువ ఆల్కహాల్ చేరుతుంది . పురుషుడికన్నా ఎక్కువ మత్తుకు గురవుతుంది.
dehydrogenase అనేది ఒక ఎంజైమ్ . ఇది ఆల్కహాల్ ను విడకొడుతుంది . మహిళ శరీరం లో ఇది తక్కువ.
అందుకే మహిళ పై మద్యం ప్రభావం ఎక్కువ ... ఎక్కువ సేపు .. ఎక్కువ స్థాయిలో మత్తు . ఎక్కువ విష ప్రభావం.
"వాడు తాగాడు నేను తాగితే తప్పేంటి ?'అనే ఆలోచన లాజికల్ గా అనిపిస్తుంది. కానీ వాడికంటే నీ కిడ్నీలు, లివర్, గుండె ఎక్కువ చెడిపోతుంది.
ఆనక నీ ఇష్టం .
మద్యం తీసుకొంటే కాన్సర్, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం పురుషుడికంటే మహిళకు పది రెట్లు ఎక్కువ.
6. పొగ తాగితే గుండె ఊపిరితి తిత్తులు పాడయ్యే అవకాశం అదే విధంగా పది రెట్లు .
గత కొన్నేళ్లుగా పొగాకు నెగెటివ్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడం వల్ల పురుషుల్లో స్మోకింగ్ తగ్గింది. తమ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం పొగాకు వ్యాపారులు తెలివిగా మీ బ్రెయిన్ వాష్ చేసి మిమ్మల్ని రొంపి లోకి దింపుతున్నారు.
అవసరమా ?
క్రిటికల్ థింకింగ్ ను ఉపయోగించండి .
7. గంజాయి ... ఇతరత్రా మత్తు పదార్థాలు తీసుకొంటే అది మిమ్మల్నే కాదు.. పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది . బిడ్డ కు జన్యు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అప్పుడు జీవితాంతం నరకం .
8. రబ్బరు తొడుగులు వాడితే కాన్సర్ వచ్చే ప్రమాదం.
9. జెల్స్ లో ఫ్లోరిన్ ఎక్కువ. అది శరీరాన్ని నాశనం చేస్తుంది.
10. పురుషుడు అక్కరలేదు .. అని లైంగిక టాయ్స్ వ్యాపారులు తెలివిగా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అవి ఎక్కువ కాలం వాడితే నరాలు దెబ్బ తింటాయి. ఇన్ఫెక్షన్ ల ప్రమాదం. అన్నిటికీ మించి మీరు సహజ సుఖాలకు దూరం అయిపోతారు.
11. సామాజిక ఒంటరి తనం ఒక శాపం. మనిషికి మనిషి తోడుండాలి. పురుషుడికి మహిళ .. మహిళకు పురుషుడు. కరుడు కట్టిన ఖైదీలకే ఏకాంత కారాగార శిక్ష... మీరు మీకెందుకు విధించుకొంటున్నారు? లైంగిక టాయ్స్ మొదటి అయిదు సంవత్సరాలు ఎవరెస్ట్ శిఖరమంత తృప్తినిస్తాయి. అటుపై అదః పాతాళం. ఆ సుఖం లో పీక్స్ కు అటుపై చేరుకోలేరు.. ఎంత వాడినా హ్యాపీనెస్ రాదు.
12. గర్భ నిరోధక మాత్రలు .. అబార్షన్ ..
సైకిల్ దెబ్బ తింటుంది . irregular పీరియడ్స్. నొప్పి .. ఎక్కువ రక్త స్రావం .. హార్మోన్ మార్పులు .. థైరాయిడ్, పీసీఓడీ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు .. జీవితం నరకం .
పుట్టే బిడ్డకు ఆటిజం .. హార్ట్ లో హోల్ .. లాంటి జన్యు వ్యాధులు .
13. అబార్షన్ చేసుకొంటే మీ సెర్వికల్ భాగం.. యుటిరైన్ భాగం ఎంత దెబ్బ తింటుంది ? ఇమ్యూన్ వ్యవస్థ ఎలా ప్రభావితం అవుతుంది ? ఒక్క సారి మీ ఫామిలీ డాక్టర్ ను అడగండి . తెలుసుకోండి.
.హాస్టల్ లో ఉంటూ రెండేళ్లలో వెయ్యి సార్లు బాయ్ ఫ్రెండ్ తో కలిస్తే ? అన్ని సార్లు రబ్బరు తొడుగులు వాడితే ? అనుకోకుండా ప్రేగ్నన్సి వస్తే ? అది ఆధునికతా? తమ లాభాల కోసం ఫార్మాసూరులు మిమ్మల్ని ఎలా రెచ్చగొడుతున్నారో ఆలోచించండి.
గర్భ నిరోధక మాత్రలు వాడితే ..
సైకిల్స్ దెబ్బ తింటాయి. ఆలోచనల చేంజెస్ . బ్రెస్ట్ సమస్యలు . బ్లడ్ క్లాట్స్.
14. సిలికాన్ ఇంప్లాంట్స్ వాడి పెద్దవి చేసుకొంటే..
బ్రెస్ట్ కాన్సర్, ALCL, ఆటో ఇమ్యూన్ డిసార్డర్.
చెబుతూ పొతే లిస్ట్ కొండవీటి చేంతాడు అవుతుంది.
వినదగు ఎవ్వరు చెప్పినా.. వినినంతనే వేగపడక వివరింపతగున్ .
మీ శరీరం .. మీ జీవితం .. మీ ఛాయిస్ .
అమ్మాయిలూ .. యువ మహిళలూ !
ఉంటాను .. నేను చెప్పినవి మీకు నచ్చితే .. నేను మీకు సార్ (టీచర్).