ఈ రోజు ఎపిసోడ్ లో యష్, వేద కార్లో ప్రయాణిస్తూ ఉండగా అప్పుడు యష్ ఆకలిగా ఉంది లేదా అనడంతో అయ్యో నేను ఇంటి దగ్గర క్యారీ మర్చిపోయాను అని అంటుంది వేద. అది కాదు వేద బయట ఎక్కడైనా తిందాం అనడంతో నాకు కూడా ఆకలిగానే ఉంది అని అనగా సరే ఇద్దరం కలిసి దగ్గర్లో డాబా ఉంది ఎక్కడ తిందాం అనడంతో వేదా నాకొద్దు అని అనగా నాక్కూడా వద్దు తింటే ఇద్దరం కలిసి తిందాం అని అంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇద్దరు కలిసి భోజనం చేయాలి అని అంటాడు యష్.