`ఐకాన్‌ స్టార్‌` లొల్లిః అల్లు అర్జున్‌ని దిల్‌రాజు కావాలని అవమానించాడా? లేక నోరు జారాడా ?

First Published Apr 18, 2021, 8:39 PM IST

అల్లు అర్జున్‌కి `ఐకాన్‌స్టార్‌` అనే ట్యాగ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే దీనిపై మాత్రం `వకీల్‌సాబ్‌` నిర్మాత దిల్‌రాజు ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం దిల్‌రాజు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 

`వకీల్‌సాబ్‌` సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు నిర్మాత దిల్‌రాజు. ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈనేపథ్యంలో శనివారం ప్రెస్‌మీట్‌ పెట్టారు దిల్‌రాజు. `వకీల్‌సాబ్‌` సక్సెస్‌ ఆనందాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి పంచుకున్నారు.
undefined
ఈ సందర్భంగా ఆయన బన్నీపై చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. అది సంచలనంగా మారింది. బన్నీ `ఐకాన్‌స్టార్‌` ట్యాగ్‌పై ఆయన ఇలా స్పందించడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
undefined
ప్రెస్‌మీట్‌లో భాగంగా వేణు శ్రీరామ్‌తో `వకీల్‌సాబ్‌`కి ముందు `ఐకాన్‌` అనే సినిమా అనుకున్నాం. అది చేయాల్సి ఉంది. నెక్ట్స్ మా కాంబినేషన్‌లోనే ఆ సినిమా తెరకెక్కిస్తామని చెప్పాడు దిల్‌రాజు. అయితే బన్నీ ఈ సినిమా చేస్తాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
undefined
ఈ క్రమంలోనే బన్నీకి `ఐకాన్‌స్టార్‌` మీరే ఇచ్చారు కదా?` అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా, అందుకు దిల్‌రాజు `అది నేనిచ్చింది కాదు, ఆయనే పెట్టుకున్నాడు` అని సడెన్‌గా అనేశాడు. ప్రెస్‌మీట్‌లో అది చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ సోషల్‌ మీడియాలో అది రచ్చగా మారింది.
undefined
పలువురు నెటిజన్లు దిల్‌రాజు వ్యాఖ్యలను ట్రోల్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ తనకు తానే `ఐకాన్‌స్టార్‌` పెట్టుకున్నాడా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. దిల్‌రాజు ఇలా కామెంట్‌ చేశాడేంటి? అని బన్నీ ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు.
undefined
దిల్‌రాజు బన్నీ విషయంలో ఈ వ్యాఖ్యలు కావాలనే చేశాడనే కామెంట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మీమ్స్, ట్రోల్స్ తో దిల్‌రాజు వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది పెద్ద దుమారం రేపుతుంది.
undefined
బన్నీతో ఇప్పటికే `ఆర్య`, `డీజే` వంటి సినిమాలు చేశాడు దిల్‌రాజు. స్టయిలీష్‌ స్టార్‌తో మంచి ర్యాపో ఉంది. అలాంటిది దిల్‌రాజు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తాడు? కావాలని అని ఉండే అవకాశం లేదు. సడెన్‌గా ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాక నోరు జారి ఉంటాడనే మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా `ఐకాన్‌స్టార్‌` ట్యాగ్‌ కొత్త వివాదాలకు, సోషల్‌ మీడియాలో సరికొత్త లొల్లికి దారితీస్తుండటం విచారకరం.
undefined
అల్లు అర్జున్‌ బర్త్ డే సందర్భంగా `పుష్ప` చిత్రంలోని ఆయన నటిస్తున్న పుష్పరాజ్‌ పరిచయం ఈవెంట్‌ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌.. అల్లు అర్జున్‌కి `ఐకాన్‌స్టార్‌` అనే ట్యాగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో సుకుమార్‌ అధికారికంగా ఇది ప్రకటించాడు. దాన్ని బన్నీ సంతోషంగా స్వీకరించారు. అన్నీ తెలిసిన దిల్‌రాజు ఇలా స్పందించడమే ఇప్పుడు వివాదంగా మారింది.
undefined
అల్లు అర్జున్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు `ఐకాన్‌` సినిమాని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది పక్కకు వెళ్లింది. ఇప్పుడు అది బన్నీతోనే ఉంటుందా? లేదా ? అన్నది ఐకాన్‌స్టార్‌ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.
undefined
click me!