సంయుక్తా మీనన్ కు 5 కోట్లు ఆఫర్ చేసిన స్టార్ హీరో..? బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ..?

First Published | May 5, 2024, 2:56 PM IST

హీరోయిన్ సంయుక్తా మీనన్ కుబంపర్ ఆఫర్ తగిలింది. ఆమెకు ఏకంగా 5 కోట్లు ఆఫర్ చేశాడట ఓ స్టార్ హీరో. ఇంతకీ సంయుక్తకు అంత భారీగా ఆఫర్ చేయడానికి కారణం ఏంటి..? 

హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి అందరికి తెలుసు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆపర్లు సాధించిన మలయాళ బ్యూటీ.. తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం పెద్దగాకనిపించడం లేదు సంయుక్తా. మంచిమంచి ఆపర్లు కూడా ఆమె వదిలేసుకుందని టాక్. కాగా మరోసారి సంయుక్తా మీనన్ కు జాక్ పాట్ తగిలిందట. 

తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తుంది సంయుక్త మీనన్. వచ్చింది కదా అని అన్ని ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. అందుకే ఆమె సినిమాలు అంత హిట్ అయినా.. వరుసగా మూవీస్ చేయడంలేదు. చాలా తక్కువగా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది సంయుక్త. 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?
 


తాజాగా సంయుక్త మీనన్ కి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట. ఆమె చేత తన సినిమాలో ఐటమ్ సాంగ్  చేయించుకోవాలి అని ఆస్టార్ హీరో అనుకుంటున్నారట. దాని కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడుట హీరో. అంతే కాదు ఈ సాంగ్ కోసం సంయుక్తకు ఏకంగా 5 కోట్ల  రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశాడట. మరి ఈ ఆఫర్ కు సంయుక్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మరి. 

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?

సంయుక్త మీనన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే చాలా కష్టం...అటువంటిది ఐటమ్ సాంగ్ కు ఒకే చెపుతుందా..? అందుకే జనరల్ గా ఐటమ్ సాంగ్ అంటే.. ఏ హీరోయిర్ కు అయినా..కోటి నుంచి రెండు కోట్లు మాత్రమేఇస్తారు. కాని సంయుక్త కోసం ఈ సినిమాకు ఏకంగా 5 కోట్లు ఇస్తామన్నారట. అసలు మామూలుగా సినిమాకు సంయుక్త 2 కోట్ల వరకూ తీసుకుంటుంది. కాని ఒక్క సాంగ్ కే ఆమెకు ఇంత ఇస్తామంటున్నట్టు తెలుస్తోంది. 

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

Samyuktha menon

కాని ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే..?  ఐదు కోట్లు కాదు పది కోట్లు ఇచ్చినా కూడా తాను  ఐటమ్ సాంగ్ చేయనని చెప్పిందట సంయుక్త  మీనన్. ఎవరైనా అంత పెద్ద ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి అందుకుంటారు. అప్పటి వరకూ ఉన్న రూల్స్ పక్కనపెట్టి అయినా.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కాని సంయుక్తా మీనన్ మాత్రం ఈ విధంగా చేయడంతో అంతా శభాస్ అంటున్నారు. 

విజయ్ అంటే చిరాకు, త్రిష సంచలన వ్యాఖ్యలు, దళపతిలో నచ్చని విషయం అదేనట...?

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన  సంయుక్త మీనన్ తెలుగులో కూడా మంచి మంచిఆఫర్లు సాధించింది. సంయుక్తా మీనన్ భీమ్లా నాయక్  సినిమా తో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా.. ఆతరువాత ధనుష్ జోడీగా సర్ సినిమాతో పాన్ ఇండియాను ఆకర్షించింది. 

Latest Videos

click me!