ఎల్లో శారీలో స్నేహ వయ్యారాలు.. కళ్ళు పేలిపోయే సొగసుతో మైమరపిస్తున్న హోమ్లీ బ్యూటీ

First Published Nov 27, 2022, 2:16 PM IST

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు.

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. తాజాగా స్నేహ ఎల్లో శారీలో అందాల దేవతలా ఫోజులు ఇచ్చింది. 

చిరునవ్వులు చిందిస్తూ చంద్రబింబం లాంటి రూపంతో కనువిందు చేస్తోంది. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహ ఈ శారీలో ఎంత అందంగా ఉందో మాటల్లో వర్ణించడం కష్టం. 

స్నేహ ఈ డ్రెస్ లో చిలిపి చిరునవ్వుతో సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇప్పటికి చెరగని అందంతో స్నేహ ఆకట్టుకుంటోంది. అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

click me!