`దేవర` ఫియర్‌ సాంగ్‌లో లిరిక్‌ సరిగా వినిపించలేదా? అయితే ఇక్కడ చూసేయండి!

Published : May 19, 2024, 11:06 PM IST
`దేవర` ఫియర్‌ సాంగ్‌లో లిరిక్‌ సరిగా వినిపించలేదా? అయితే ఇక్కడ చూసేయండి!

సారాంశం

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` నుంచి ఫస్ట్ సాంగ్‌ వచ్చింది. `ఫియర్‌` పేరుతో సాగే ఈ పాట శ్రోతలను, తారక్‌ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. మరి ఈ పాటపూర్తి లిరిక్‌పై ఓ లుక్కేయండి.   

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` నుంచి మొదటి పాట వచ్చింది. తారక్‌ బర్త్ డే సందర్భంగా ఒక్క రోజు ముందుగానే పాటని విడుదల చేశారు. రేపు ఎన్టీఆర్‌ బర్త్ డే నేపథ్యంలో ఆదివారం `ఫియర్‌` సాంగ్‌ని విడుదల చేసింది టీమ్. భారీ అంచనాల మధ్య ఈ పాట విడుదలైంది. దీనికి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తూ ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి రాశారు. తెలుగులో చాలా లోతైనా అర్థంలో ఈ పాటని రాయడం విశేషం. దేవర క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసేలా, ఆయన ఎంతటి పవర్‌ఫుల్లో తెలియజేసేలా ఈ పాట సాగింది. 

అనిరుధ్‌ రవిచందర్‌ ఈ పాటని చాలా ఎనర్జిటిక్‌గా డిజైన్‌ చేశారు. అయితే సౌండింగ్‌ ఎక్కువైంది. లిరిక్‌ సరిగా అర్థమయ్యేలా, వినిపించేలా లేదు. సౌండ్‌తోపాటు ఎన్టీఆర్‌ విజువల్స్, అనిరుథ్‌ డాన్స్ మూమెంట్లతో లిరిక్‌ని డామినేట్‌ చేశారు. దీంతో అసలు ఈ పాటేంటి? అందులో ఏముంది అనే డౌట్‌ కలుగుతుంది. ఈ నేపథ్యంలో వారి ఆసక్తి మేరకు పూర్తి లిరిక్‌ని ఇక్కడ అందిస్తున్నాం. 

`ఫియర్‌` సాంగ్‌ పూర్తి సాహిత్యాన్ని ఓ సారి చూసేయండి. 

అగ్గంటుకుంది సంద్రం 
భగ్గున మండె ఆకసం 
అరాచకాలు భగ్నం 
చల్లారె చెడు సాహసం 
జగడపు దారిలో 
ముందడుగైన సేనాని 
జడుపును నేర్పగా 
అదుపున ఆపే సైన్యాన్ని 
దూకే ధైర్యమా జాగ్రత్త 
రాకే తెగబడి రాకే 
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే 
కాలం తడబడెనే 
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే 
కలుగుల్లో దూరెనే 

జగతికి చేటు చేయనేల 
దేవర వేటుకందనేల 
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ 
కనులకు కానరాని లీల 
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా 
అలలయ్యే ఎరుపు నీళ్ళే 
ఆ కాళ్ళను కడిగెరా 
ప్రళయమై అతడి రాకే 
దడ దడ దడ దండోరా 

దేవర మౌనమే 
సవరణ లేని హెచ్చరిక 
రగిలిన కోపమే 
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త 
రాకే తెగబడి రాకే 
దేవర ముంగిట నువ్వెంత 
భయమున దాక్కోవే
కాలం తడబడెనే 
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే 
కలుగుల్లో దూరెనే 
దూకే ధైర్యమా జాగ్రత్త 
రాకే తెగబడి రాకే 
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే

ఇలా చాలా పవర్‌ఫుల్‌ లిరిక్‌ని అందించారు రామజోగయ్య శాస్త్రి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఈ పాట మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో దాన్ని రీచ్‌ అయ్యేలా సాంగ్‌ లేదనే టాక్‌ వినిపిస్తుంది. హడావుడి తప్ప, ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. మరి ఇటీవల తమకు కాంపీటిషన్‌గా భావించే `గేమ్‌ ఛేంజర్‌`, `పుష్ప2` చిత్రాల్లోని తొలి సాంగ్‌లను ఇది దాటేస్తుందా అనేది చూడాలి. 

మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఆయన సోమవారంతో 41 పూర్తి చేసుకుని 42లోకి అడుగుపెడుతున్నారు. ఫ్యాన్స్ ఆల్రెడీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. `దేవర` దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని కొరటాల శివ చెప్పారు.  దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు