దేవర ఫియర్ సాంగ్... ఎన్టీఆర్ బీభత్సం, అనిరుధ్ అద్భుతం, సాంగ్ కేక! 

By Sambi ReddyFirst Published May 19, 2024, 7:41 PM IST
Highlights


ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో దేవర నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అంచనాలు మించేలా ఫియర్ సాంగ్ అద్భుతంగా ఉంది. విజువల్స్ గూస్  బంప్స్ రేపుతున్నాయి. 
 

మే 20న ఎన్టీఆర్ జన్మదినం. 1983లో జన్మించిన ఎన్టీఆర్ 41వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ఫ్యాన్స్ ఆల్రెడీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేవర అప్డేట్స్ కోసం అల్లాడిపోతున్న ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు ఎన్టీఆర్. దేవర నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఫియర్ సాంగ్ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది. 

ఫియర్ సాంగ్ ని చెన్నై లో ప్రత్యేకంగా షూట్ చేశారు. అనిరుధ్ తన స్టైలిష్ లుక్ తో దేవరకు అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. దేవర మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా ఫెరోషియస్ గా డిజైన్ చేశాడు కొరటాల శివ. శత్రుసంహారానికి పూనుకుంటే రక్తం ఏరులై పారాల్సిందే. సముద్రపు కెరటాలు ఎరుపెక్కాల్సిందే. దేవర మూవీలో ఎన్టీఆర్ పాత్ర తీరు తెలియజేసేలా ఫియర్ సాంగ్ ఉంది. 

Latest Videos

అనిరుధ్ ట్యూన్స్ తో పాటు ఆయన పాడిన తీరు ఆకట్టుకుంది. రామజోగయ్య సాహిత్యం పాటను మరింత మాస్ అండ్ వైల్డ్ గా మార్చింది. రామజోగయ్య శాస్త్రి వాడిన పదాలు గూస్ బంప్స్ రేపుతున్నాయి. సాంగ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పాటలో మరో హైలెట్. మొత్తంగా దేవర ఫస్ట్ సింగిల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉంది. 

దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని కొరటాల శివ చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. 
 

click me!