నా భర్త మేకప్ మెన్ కి కూడా ఫోన్ కాల్ చేస్తాడు.. టాలీవుడ్ ఇంకా మారలేదు, కాజల్ కామెంట్స్

Published : May 19, 2024, 09:45 PM IST
నా భర్త మేకప్ మెన్ కి కూడా ఫోన్ కాల్ చేస్తాడు.. టాలీవుడ్ ఇంకా మారలేదు, కాజల్ కామెంట్స్

సారాంశం

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో రాణిస్తోంది. పెళ్లి తర్వాత కాజల్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. బిడ్డకు తల్లి అయ్యాక సినిమాలు మొదలుపెట్టేసింది. కాజల్ నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతోంది.

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో రాణిస్తోంది. పెళ్లి తర్వాత కాజల్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. బిడ్డకు తల్లి అయ్యాక సినిమాలు మొదలుపెట్టేసింది. కాజల్ నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతోంది. దీనితో కాజల్ వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 

పెళ్లి తర్వాత అవకాశాలు రావడంపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్ళైతే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయాన్ని కాజల్ తప్పని నిరూపించింది. కాజల్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా కెరీర్ లో ఎలాంటి మార్పు లేదు. బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు బిజీగా ఉంటున్నారు. 

అయితే ఈ విషయంలో టాలీవుడ్ లో ఇంకా మార్పు రాలేదు. ఇక్కడ పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. త్వరలో ఇక్కడ కూడానా మార్పు వస్తుంది. అందుకు నేనే ఉదాహరణ అని కాజల్ పేర్కొంది. 

పెళ్లి తర్వాత నా పర్సనల్ లైఫ్ లో కూడా మార్పు లేదు. నేను ఎవరినీ మిస్ అవడం లేదు. ఆ విషయంలో నా భర్త చాలా సపోర్టివ్ గా ఉంటారు. నా భర్త వీలైనప్పుడల్లా నన్ను సెట్స్ లో కలుస్తుంటారు. అవసరం అయితే ఫోన్ చేస్తారు. నేను బిజీగా ఉంటే నా మేనేజర్ కి కానీ, మేకప్ మెన్ కి కానీ ఫోన్ చేసి విషయం చెబుతారు. నేను నా భర్తకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ కి కూడా సమయం ఇవ్వాలి అని కాజల్ అంటోంది. 

PREV
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి