అఫీషియల్.. భారతీయుడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫస్ట్ సాంగ్ తో పాటు మరో క్రేజీ అప్డేట్

By tirumala ANFirst Published May 19, 2024, 10:23 PM IST
Highlights

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న భారతీయుడు 2 చిత్రానికి ఎట్టకేలకు రిలీజ్ డేట్ దొరికింది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ తో పాటు ఆసక్తికర అప్డేట్ కూడా ఇచ్చారు. 

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న భారతీయుడు 2 చిత్రానికి ఎట్టకేలకు రిలీజ్ డేట్ దొరికింది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ తో పాటు ఆసక్తికర అప్డేట్ కూడా ఇచ్చారు. చాలా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సీక్వెల్ భారతీయుడు 2. దాదాపు 27 ఏళ్ళ తర్వాత శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ప్రారంభించారు. 

ఈసారి భారతీయుడు చేయబోయే విన్యాసాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఈ చిత్రంలో కాజల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 12న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. 

Latest Videos

అంతే కాదు.. మే 22న ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక నుంచి భారతీయుడు 2 చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో మోతెక్కించనున్నారు. 

చెన్నైలో జూన్ 1న గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. ఈ ఈవెంట్ చాలా భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భారతీయుడు ఊపు మళ్ళీ మొదలైంది. ఇదే జోష్ లో ఇటీవల శంకర్ భారతీయుడు 3 కూడా ప్రకటించారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

click me!