రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

Published : May 19, 2024, 06:32 PM ISTUpdated : May 19, 2024, 06:54 PM IST
రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

సారాంశం

జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. దాంతో పవిత్ర కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.   

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. 

వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 11న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళుతుండగా నెల్లూరు జిల్లా ఉప్పలపాడు వద్ద తన కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. దాంతో పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్ళింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. పవిత్ర కారు ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పవిత్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినట్లు పవిత్ర తెలియజేశారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ విషయం తెలియజేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణాన్ని తట్టుకోలేని ప్రియుడు చంద్రకాంత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. 
 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్
చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?