SRH vs PBKS: అభిషేక్ శ‌ర్మ దెబ్బ‌కు బౌల‌ర్లు బెంబేలెత్తిపోయారు.. !

By Mahesh Rajamoni  |  First Published May 20, 2024, 12:11 AM IST

SRH vs PBKS: ఐపీఎల్‌లో తన సునామీ బ్యాటింగ్‌తో ప్రపంచ టాప్ బౌలర్లలో భయాందోళనలు సృష్టించిన 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ. ఐపీఎల్ 2024లో అభిషేక్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకుంటున్నాడు.
 


SRH vs PBKS : ఐపీఎల్ 2024లో 69వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్  పంజాబ్‌తో జరిగిన త‌న చివ‌రి లీగ్ మ్యాచ్ ను కూడా విజ‌యంతో ముగించింది. ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి త‌న సునామీ బ్యాటింగ్ తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజ‌న్ ప్రారంభం నుంచి అభిషేక్ శ‌ర్మ త‌న సునామీ బ్యాటింగ్ తో బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకుంటున్నాడు. త‌న ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ స్టేడియాన్ని షేక్ చేస్తున్నాడు. ప్ర‌పంచ టాప్ బౌల‌ర్ల‌ను త‌న బ్యాట్ తో భ‌య‌పెడుతున్నాడు.

ప్రపంచంలోని గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరైన పాట్ కమిన్స్  ప్ర‌స్తుతం హైద‌రాబాద్ టీమ్ ముందుకు న‌డిపిస్తున్నాడు. తన బౌలింగ్‌తో  పెద్ద పెద్ద స్టార్ బ్యాట్స్‌మెన్ల‌ను వ‌ణికించాడు. త‌న పేస్ బౌలింగ్ తో స్టార్ బ్యాట‌ర్ల‌ను మోకరిల్లేలా చేశాడు. కానీ ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ తన సొంత జట్టు 23 ఏళ్ల ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి షాక్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఫోర్లు సిక్స‌ర్ల‌తో ప‌రుగుల సునామీ సృష్టిస్తున్న అభిషేక్ శర్మ.. లీగ్ రౌండ్ చివరి మ్యాచ్ లోనూ తుఫాన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.

Latest Videos

ధోని ఐపీఎల్ కెరీర్ ముగిసిన‌ట్టేనా?.. స్టార్ ప్లేయ‌ర్ ఏం చెప్పాడో చూడండి.. !

పంజాబ్ ఉంచిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ జట్టు బరిలోకి దిగింది. విధ్వంసానికి మారుపేరుగా ఉన్న ట్రావిస్ హెడ్ డ‌కౌట్ తో షాక్ త‌గిలింది. కానీ అభిషేక్ శర్మ తన సునామీ బ్యాటింగ్ ను కొనసాగించాడు. అభిషేక్ కేవలం 28 బంతుల్లో 6 భారీ సిక్స‌ర్లు, 5 ఫోర్ల సాయంతో 66 పరుగుల ఇన్నింగ్స్‌ను ఆడాడు.  ఈ ఐపీఎల్ సీజన్‌లో అభిషేక్ శర్మకు ఇది మూడో అర్ధశతకం. 13 మ్యాచ్‌లు ఆడి 467 పరుగులు చేశాడు.

పాట్ కమిన్స్  కామెంట్స్ వైర‌ల్.. 

అభిషేక్ శర్మ సునామీ బ్యాటింగ్ ను చూసి పాట్ కమిన్స్ కూడా భ‌య‌ప‌డిపోయాడు. దీని గురించి మాట్లాడుతూ, "ఇది చాలా బాగుంది..  అద్భుతంగా ఉంది. ఇక్కడ 7 మ్యాచుల్లో 6 గెలిచి అద్భుతమైన క్రికెట్ ఆడాం. అభిషేక్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అభిషేక్ శ‌ర్మ‌కు వ్యతిరేకంగా బౌలింగ్ చేయాలనుకోవ‌డం లేదు.. అతనికి వ్యతిరేకంగా బౌలింగ్ చేయాలంటే భయంగా ఉంది. నితీష్ మంచి ఆటగాడు, వయసు కంటే మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడు. అతను టాప్ ఆర్డర్‌కు పర్ఫెక్ట్" అని పేర్కొన్నాడు.

చ‌రిత్ర సృష్టించిన‌ అభిషేక్ శర్మ

సీజన్ మొత్తం మీద అభిషేక్ అన్ని జట్లపై సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త రికార్డును న‌మోదుచేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. అలాగే, స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అభిషేక్ టాప్ లో ఉన్నాడు. ఇప్పటివరకు మొత్తం 41 సిక్సర్లు కొట్టాడు. అంత‌కుముందు ఈ రికార్డు 2016 ఐపీఎల్ సీజ‌న్ లో 38 సిక్సర్లతో విరాట్ కోహ్లీ పేరిట ఉంది.

IPL 2024: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శ‌ర్మ ఫైర్.. అస‌లు గొడవేంటి..?

click me!