Today Horoscope: ఓ రాశివారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది

First Published | May 20, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology

20-5-2024,  సోమవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)


మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రవి)
కృత్తిక నక్షత్రం వారికి  (దినాదిపతి కుజుడు)

దిన ఫలం:-శారీరక పీడ ఇబ్బంది పడతారు.అధికారులు తో అకారణంగా మనస్పర్థలు రాగలవు. సమాజంలో ఆచితూచి వ్యవహరించాలి.భార్యాభర్తల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు.క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం.విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించాలి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.ఓం అర్కాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4 రోహిణి ,మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో అనుకున్నది సాధిస్తారు.ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.ప్రయాణాలు అనుకూలిస్తాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.పలుకుబడితో పనులు నెరవేరుతాయి.వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఓం ఆంజనేయాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.

Latest Videos


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-శుభ ఫలితాలను పొందగలరు.ధనానికి లోటు ఉండదు.విద్యార్థులకు నూతన విద్యా ప్రయత్నాల ఫలించును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా జరుగుతాయి.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు అవును.ఓం ఆదిలక్ష్మి దేవ్యై నమః అని నామస్మరణ చేయడం మంచిది.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-బంధుమిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి.మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుష వాక్యములు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న పనులు లో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగగలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉంటుంది.ఓం భవాని దేవ్యై నమః అని నామస్మరణ చేయడం మంచిది.
 

telugu astrology

సింహం (మఖ ,పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినాధిపతి రాహు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాధిపతి రవి)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)

దిన ఫలం:-ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి గాక చికాకు పుట్టించును.వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించాలి. అనుకోని అధిక  ఖర్చులు పెరుగుతాయి.వి‌ వాహాది శుభకార్య ప్రయత్నాలు లో ఆటంకములు రాగలవు.చేయు వ్యవహారములలో అధైర్యానికి లోన్ అవుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.ఓం శంకరాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.
 

telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4 హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. నూతన ఒప్పందం చేసుకుంటుంటారు.వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి.నూతన పరిచయాలు వలన వ్యవహారాల పూర్తి కాగలవు.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-మిశ్రమ ఫలితాలు పొందగలరు.చేయు వ్యవహారాల్లో తగ్గి వ్యవహరించాలి. ఖర్చులను నియంత్రించాలి.విద్యార్థులు చేయు ప్రయత్నాలు పట్టుదలతో చేయవలెను.పనుల్లో అధిక ఒత్తిడి ఉన్న సకాలంలో పనులు పూర్తి కాగలవు.   అవావాహితులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.  ఆదాయ మార్గాలను పెంచుకోగలరు.మానసిక ఉద్వేగాలను తగ్గించుకోవాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం షణ్ముఖాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ ,)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.రావలసిన డబ్బు చేతికి అందుతుంది.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.ఆసక్తికరమైన విషయాలు వింటారు. నూతన పరిచయాలు వలన ప్రయోజనం సమకూరును.ప్రయత్నించిన వ్యవహారాలు అనుకూలంగా పూర్తి కాగలవు.ఓం దత్తాత్రేయాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.

telugu astrology

ధనుస్సు (మూల ,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి రవి)
ఉ.షాఢ నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు)

దిన ఫలం:-అన్ని విధాలా అభివృద్ధి కనబడుతుంది.అధికారులు తో సత్సంబంధాలు పెరుగుతాయి.సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది.నిలిచిపోయిన పనులు మరల ప్రారంభమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఓం రామాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4 శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి  (దినాధిపతి గురుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-శుభ ఫలితాలను పొందగలరు.ధనానికి లోటు ఉండదు.విద్యార్థులకు నూతన విద్యా ప్రయత్నాల ఫలించును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా జరుగుతాయి.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు అవును.ఓం ఆదిలక్ష్మి దేవ్యై నమః అని నామస్మరణ చేయడం మంచిది.

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4 శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉంటుంది.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాగలవు.అన్ని రకాల ఆదాయం సమకూరుతుంది.వ్యాపారం లాభసాటిగా జరుగును.మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు.శుభకార్యాది ప్రయత్నాలు ఫలించును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఓం మహాలక్ష్మ్యై నమః అని నామస్మరణ చేయడం మంచిది.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ -ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి బుధుడు)
రేవతి నక్షత్రం  వారికి  (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-తలచిన వ్యవహారాల్లో ప్రతికూలంగా ఉంటాయి.అధికారులు విభేదాలు తలెత్తవచ్చు.విద్యార్థులకు పట్టుదల అవసరం.ఆర్థికంగా సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకోగలరు.అనవసరపు పట్టువదలని విడిచి పెట్టాలి.వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.సహోద్యోగులతో సంయమనం పాటించడం మంచిది. వాహన యంత్రాలతో జాగ్రత్తగా ఉండవలెను.మానసిక చికాకులు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.చేసే పనుల్లో కోపం అధికంగా ఉంటుంది.అపవాదము రాగలవు.ఓం మహేశ్వరాయ నమః అని నామస్మరణ చేయడం మంచిది.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!