సమంత లేటెస్ట్ ఫోటోస్, బాగా నీరసంగా కనిపిస్తున్న సామ్.. ఆరోగ్యం సహకరించకపోయినా 'యశోద' కోసం..

First Published Nov 7, 2022, 2:08 PM IST

సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. 

సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.  దీనితో సమంతకి మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే నవంబర్ 11న సమంత నటించిన యశోద చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఈ నేపథ్యంలో యశోద చిత్ర ప్రమోషన్స్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. యశోద చిత్రంలో సమంత మెయిన్ లీడ్. సామ్ ప్రమోట్ చేస్తేనే సినిమాపై బజ్ ఏర్పడుతుంది. మరోవైపు ఆమెకి ఆరోగ్యం సహకరించడం లేదు. కానీ అక్కడున్నది సమంత. చివరి క్షణం వరకు ధైర్యం కోల్పోకపోవడం, పోరాడడం సమంత లక్షణాలు. 

అందుకే ఆరోగ్యం సహకరించక పోయినా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగింది. తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా ఫ్రెండ్ ఒకరు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఎంత కఠినంగా ఉన్నా తన మోటివ్ ఒక్కటే.. అనుకున్న పని చేసి చూపించాలి. అతని నుంచే ఆ మోటివ్ ని నేను రుణంగా తీసుకున్నా. యశోద ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగా అని పేర్కొంది. 

ఈ సందర్భంగా సమంత బ్లాక్ డ్రెస్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో సమంత బాగా నీరసంగా కనిపిస్తోంది. మయోసైటిస్ ప్రభావం స్పంష్టంగా కనిపిస్తోంది. 

యశోద చిత్రంలో సమంతతో కలసి నటించిన ఉన్ని ముకుందన్ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని విష్ చేశాడు. ఆమె పోరాటం చేసి ఆ వ్యాధి నుంచి బయటపడుతుంది. ఆరోగ్యంగా తిరిగి వస్తుంది అని ఉన్ని ముకుందన్ తెలిపారు. యశోద చిత్రం సరోగసి నేపథ్యంలో హరీష్ - హరి దర్శకత్వంలో తెరకెక్కింది. 

యశోద షూటింగ్ అనంతరం సమంత విదేశాలకు వెళ్లి మయోసైటిస్ కి చికిత్స తీసుకుంది. ఈ చిత్రంలో ఉత్కంఠ భరితమైన అంశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

click me!