Latest Videos

Pushpa: సమంత ఐటమ్ సాంగ్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. పాట మొత్తం బూతులు

First Published Dec 11, 2021, 8:04 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తుండడం, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 

శుక్రవారం ఈ చిత్రం నుంచి ఐటెం సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ సాగే ఈ పాట తప్పకుండా మాస్ జనాలని ఆకర్షించే విధంగా ఉంది. ఈ సాంగ్ లో సమంత పెర్ఫామ్ చేస్తోంది. లిరికల్ వీడియోలో Samantha హాట్ స్టిల్స్ చూపించారు. 

సమంత అందాలతో ఈ పాటని థియేటర్స్ లో ఫ్యాన్స్ కి కనుల విందు కానుంది. అయితే ఈ పాటపై అంతేస్థాయిలో అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ పాటలోని లిరిక్స్ దారుణంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మగవారిని తప్పుగా చిత్రీకరించేలా లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పాటని రాసినట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

అమ్మాయిలు ఎలా ఉన్నా మగవారు విడిచిపెట్టారు అని, మీ మగబుద్దే వంకర బుద్ది అంటూ ఈ సాంగ్ లో లిరిక్స్ ఉన్నాయి. చీకటి పడితే మగవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు అని అర్థం వచ్చేలా సాంగ్ ఉంది. చెప్పడానికి మనకి నీతులు.. పాట మొత్తం బూతులు అంటూ నెటిజన్లు ఈ సాంగ్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. 

మగబుద్ధి వంకర బుద్ది అని రాసిన చంద్రబోస్.. ఆడవారి గురించి అలా రాసే ధైర్యం చేయగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆడవారి గురించి రాస్తే ఫెమినిజం పేరుతో తీవ్రమైన అటాక్ మొదలవుతుంది. కానీ మగవారిని మాత్రం ఎమన్నా చెల్లిపోతుంది అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

ఇక ఈ సాంగ్ లో సమంత తన అందాలు ఘాటుగా ఆరబోసినట్లు ఉంది. లిరికల్ వీడియోలో సమంత హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో రెచ్చిపోయి కనిపించింది. ఈ పాటని ఇంద్రవతి చౌహన్ తన మత్తు వాయిస్ తో పాడి ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో దాదాపు 8 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత మరింత సెన్సేషన్ గా మారిపోయింది. సమంత హాట్ హాట్ అందాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. Also Read: Samantha Item Song: సమంత ఊరమాస్‌ సాంగ్‌... `ఊ అంటవా మావ.. ఉ ఉ అంటావా`.. ఫ్యాన్స్ కి పండగే

click me!