Today Horoscope:ఓ రాశివారిపై చెయ్యని పనికి నిందలు పడతాయి..

First Published | Jun 15, 2024, 5:30 AM IST

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology

15-6-2024  శనివారం  మీ రాశి ఫలాలు

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పాడతాయి. కుటుంబంతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారులకు ఒత్తిడి అధికంగా ఉంటుంవది. ఉద్యోగులకు పనిభారం తప్పదు. 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుంది. శుభకార్యాలకు కుటుంబంతో వెళతారు. స్థిరాస్థి విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారం లాభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగులకు ఈ రోజు బాగుంటుంది. 


telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- స్థిరాస్తుల విషయంలో కొనసాగుతున్న వివాదాలు ఒకరి జ్యోక్యంతో పరిష్కరించబడతాయి. అత్యవసర సమయంలో సన్నిహితుల నుంచి సహాయం పొందుతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. ధనయోగం కలుగుతుంది. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఇది మీకు నిరాశను కలిగిస్తుంది. ప్రయాణాలు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడతారు. వృత్తి, వ్యాపారాలు బాగానే సాగుతాయి. ఉద్యోగులకు ఈ రోజు అనుకున్న విధంగా ఉండదు. 
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- బంధుమిత్రులతో గొడవలు జరుగుతాయి. ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు దీన స్థితిలో ఉంటాయి.  ఉద్యోగులకు పని బాధ్యతలు మరింత పెరుగుతాయి. 
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మీరు ఊహించని విధంగా మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇది మీకు ఆనందాన్ని, ఆశ్ఛర్యాన్ని కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలకు వెళతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలకు ఈ రోజు లాభాదాయకంగా ఉంటుంది. 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-ఇంటి పెద్దల సహాయ, సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ప్రయాణాలతో బాగా అలసిపోతారు. ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కష్టాల్లో మునిగిపోతాయి. ఉద్యోగులు పనికి దగ్గ ఫలితం మాత్రం పొందరు. 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-నూతన వస్తు, వాహనాలను కొనే సూచనలు ఉనన్ాయి. క్రయ, విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు. అన్ని రంగాల వారికి ఈ రోజు లాభాల పంట పండుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. 
 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఉద్యోగులకు అధికారుల నుంచి బాధ్యతలు పెరుగుతాయి. వీరితో మాటలు కూడా పడాల్సి వస్తుంది. అన్నదమ్ములతో మాట పట్టింపులు వస్తాయి. ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. ఆర్థిక వ్యవహారాలు మీరు ఊహించినట్టుగా ఉండవు. 
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులు నూతన అవకాశాలను పొందుతారు. పుణ్యక్షేత్రాలకు వెళతారు. 
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. మీకు ఆహ్వానం అందుతుంది. భూమికి సంబంధించిన వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. ధనలాభం కలిగే యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు మంచి లాభాల్లో కొనసాగుతాయి. ఉద్యోగుల పనికి మంచి గుర్తింపు వస్తుంది. 
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. మీరు ఎలాంటి చెడు పనిచేయకపోయినా మీపై నిందలు పడతాయి. ప్రయాణాల్లో  ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. వృత్తి, ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. 

Latest Videos

click me!