Latest Videos

సుధీర్ బాబు ‘హరోం హర’టిక్కెట్ ఫ్రీ ఆఫర్, డిటేల్స్

By Surya PrakashFirst Published Jun 14, 2024, 6:53 AM IST
Highlights

ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్ అయిన ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. “HAROMHARA” అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా ....


సుధీర్ బాబు కు ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ పడలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా రిలీజ్ కు ముందు ఎంతో ఆసక్తి రేపిన ‘హంట్’ (Hunt), ‘మామా మశ్చీంద్ర'(Mama Mascheendra)డిజాస్టర్స్ అయ్యాయి. ఈ నేపధ్యంలో  ఎలాగైనా హిట్టు కొట్టాలని కొత్త కాన్సెప్టుతో  ‘హరోం హర’ (Harom Hara) చేశాడు. ‘శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్’ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు  (Sumanth G Naidu) నిర్మించిన ఈ చిత్రాన్ని ‘సెహరి’ (Sehari)  ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) డైరెక్ట్ చేశాడు.  ఈ రోజు (జూన్ 14 న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తుంది. 

ఇదిలా ఉంటే హరోం హర సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీం బంపర్ ఆఫర్ ఇచ్చింది.రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చింది మూవీ టీమ్ ప్రకటించింది. ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్ అయిన ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. “HAROMHARA” అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా బుక్‍ మై షోలో ఈ ఆఫర్ పొందవచ్చు. బుక్ మై షోలో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే ముందు HAROMHARA అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రెండు టికెట్ల ధరకే మూడు టికెట్స్ లభిస్తాయని మూవీ టీమ్ తెలిపింది.

సినిమాపై నమ్మకంతో ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు మేకర్స్. వారు చెప్పేదాని ప్రకారం ‘హరోం హర’ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. మొదటి 15 నిమిషాలు.. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ గా ఉంటాయని… సెకండ్ హాఫ్ కూడా చాలా రేసీగా సాగుతుందని అంటున్నారు.   మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సునీల్ ,జయ ప్రకాష్ ,అక్షర ,అర్జున్ గౌడ ,లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 
 

click me!