Latest Videos

విశ్వంభర విలన్ వచ్చేశాడు... ఏకంగా బాలీవుడ్ నుండి దించారుగా!

By Sambi ReddyFirst Published Jun 14, 2024, 4:52 PM IST
Highlights

విశ్వంభర చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడిని దింపారు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన చేశారు. మరి చిరును ఢీ కొట్టనున్న ఆ విలన్ ఎవరో చూద్దాం.. 
 

చిరంజీవి జోరు మామూలుగా లేదు. గత రెండేళ్లలో ఆయన నాలుగు సినిమాలు విడుదల చేశారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. భోళా శంకర్ విడుదల అనంతరం షార్ట్ గ్యాప్ తీసుకున్న చిరంజీవి... మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. విశ్వంభర టైటిల్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

సోషియో ఫాంటసీ అంశాలతో విశ్వంభర తెరకెక్కుతుంది. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్స్ సైతం భాగం అవుతున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా విశ్వంభర పాన్ ఇండియా చిత్రం కావడంతో అదే స్థాయిలో క్యాస్ట్ ని ఎంపిక చేస్తున్నారు. 

బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విశ్వంభర చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. ఆయన మెయిన్ విలన్ అని ప్రచారం జరుగుతుంది. కునాల్ గతంలో తెలుగు చిత్రం దేవదాస్ లో నటించాడు. నాగార్జున-నాని నటించిన ఈ మల్టీస్టారర్ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. 2018లో దేవదాస్ విడుదల కాగా గ్యాప్ ఇచ్చి విశ్వంభర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. బాలీవుడ్ లో రంగ్ దే బసంతి వంటి హిట్ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో కునాల్ కపూర్ నటించాడు. 

Delighted to welcome the charismatic on board for the MAJESTIC WORLD of ❤️‍🔥

In cinemas on January 10th, 2025 🌠

MEGASTAR pic.twitter.com/kGqnypXZv6

— Vassishta (@DirVassishta)

 

 

click me!