Latest Videos

కన్నప్ప టీజర్... మంచు విష్ణు పాత్ర పేరు అది కాదా? ప్రభాస్ లుక్ హైలెట్!

By Sambi ReddyFirst Published Jun 14, 2024, 6:17 PM IST
Highlights

హీరో మంచు విష్ణు చేస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ విడుదల చేశారు. ఇక కన్నప్ప టీజర్ లో ప్రభాస్ లుక్ హైలెట్ గా నిలిచింది. 
 

హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిగా కృషి చేస్తున్నాడు మంచు విష్ణు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న కన్నప్ప విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. జూన్ 14న కన్నప్ప టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆసక్తి రేపింది. 

కన్నప్ప టీజర్లో యాక్షన్ ఎపిసోడ్స్, లొకేషన్స్, గెటప్స్ హైలెట్ అని చెప్పాలి. 80 శాతం షూటింగ్ న్యూజిలాండ్ దేశంలో చిత్రీకరించారు. షూటింగ్ కి అవసరమైన ప్రాపర్టీస్ ఇండియా నుండి షిప్స్ లో న్యూజిలాండ్ తరలించారు. అక్కడి సహజమైన అడవులు, పచ్చిక బయళ్లలో చిత్రీకరణ జరిపారు. కన్నప్ప టీజర్ లో లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. గుర్రపు స్వారీలు, విలు యుద్ధాలు ఆకట్టుకున్నాయి. కన్నప్ప మూవీలో మంచు విష్ణు పాత్ర పేరు 'తిన్నడు' కావడం విశేషం. 

ప్రత్యేక పాత్రలు చేస్తున్న మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లను పాక్షికంగా పరిచయం చేశారు. ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని మొదటి నుండి ప్రచారం జరిగింది. కానీ అక్షయ్ కుమార్ అని తర్వాత స్పష్టత వచ్చింది. టీజర్ తో ఆ సందేహాలు పూర్తిగా తొలగిపోయాయి. అక్షయ్ కుమార్ ని శివుడిగా చూపించారు. ప్రభాస్ ని సైతం టీజర్లో చూడొచ్చు. ముఖాన అడ్డ నామాలతో ప్రభాస్ లుక్ గూస్ బంప్స్ రేపింది. ఆయన నందీశ్వరుడు పాత్ర చేస్తున్నాడని సమాచారం. 

బీజీఎం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తంగా కన్నప్ప టీజర్ అంచనాలు అందుకుంది. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది. 
 

click me!