శోభనని హీరో మోసం చేశాడా?.. సీనియర్‌ హీరోయిన్‌ సింగిల్‌ గా ఉండిపోవడం వెనుక ఇంతటి కథ ఉందా?

First Published Jun 14, 2024, 11:24 PM IST

అలనాటి హీరోయిన్‌ శోభన ఐదు పదులు దాటినా మ్యారేజ్‌ చేసుకోలేదు. మరి అందుకు కారణమేంటి? అనేది చూస్తే ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. 
 

దాదాపు రెండు దశాబ్దాలపాటు సౌత్‌ సినిమాని ఊపేసిన నటి శోభన. అద్భుతమైన అభినయం, అంతే అందం ఆమె సొంతం. దీనికితోడు అత్యద్భుతమైన నాట్యంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ నాట్యకారిణిగా అలరిస్తున్నారు. కేరళాకి చెందిన శోభన.. మలయాళంతోపాటు, తమిళం, తెలుగులోనూ అనేక సినిమాలు చేశారు. ఎన్నో సూపర్‌ హిట్లు అందుకున్నారు. స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. 

రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, మీనా, విజయశాంతి, నగ్మ వంటి వారికి దీటుగా రాణించారు. నాలభైకి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు స్టార్లతోనూ కలిసి నటించింది శోభన. 1997 తర్వాత తెలుగుకి దూరమైంది. మధ్యలో మోహన్‌ బాబు `గేమ్‌` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు 18ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె `కల్కి2898ఏడీ`లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 

Shobana

`కల్కి2898ఏడీ` ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఓ సీన్‌లో మెరిశారు. రెండు దశాబ్దాలకు మళ్లీ ఆమె తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది శోభన. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వైరల్‌ గా మారుతుంది. శోభన ప్రస్తుత వయసు 54. కానీ ఇంత వయసు వచ్చినా ఆమె మ్యారేజ్‌ చేసుకోలేదు. దానికి కారణాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Shobana

శోభన మలయాళి అమ్మాయి. అక్కడ క్లాసికల్‌ డాన్స్ కి ప్రయారిటీ ఇస్తారు. దీంతో చిన్నప్పట్నుంచే నేర్చుకుంది. నాట్య కారణిగా రాణిస్తూనే సినిమాల్లోకి వచ్చారు. ఓ ఊపు ఊపేసింది. అయితే ఆమె మ్యారేజ్‌ చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఓ బలమైన కారణం ఉందట. తాను ఓ హీరోని ప్రేమించిందట. ఎంతో గాఢంగా శోభన ఆ హీరోని ప్రేమించిందని, కానీ అతను హ్యాండిచ్చాడట. అది తట్టుకోలేకపోయిందట శోభన. దీంతో పెళ్లికే దూరమయ్యిందట. 
 

ప్రేమలో మోస పోయిన బాధని తట్టుకోలేకపోయిందట శోభన. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాను మ్యారేజ్‌ చేసుకోకూడదని అని నిర్ణయించుకుందట. అలా ఐదు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది శోభన. మరి ఇదే కారణమా? దీనికంటే వేరేరీజన్స్ ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటుంది శోభన. 
 

பரதநாட்டியம் ஆடும் ஷோபனா

1984 సంవత్సరం లో `శ్రీమతి కానుక` సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా లో సుమన్ హీరో. ఆ తరువాత నాగార్జున హీరో గా ‘విక్రమ్’ సినిమా లోను కనిపించింది. చిరంజీవి తో `రౌడీ అల్లుడు`, బాలకృష్ణ హీరో గా `మువ్వ గోపాలుడు` వంటి సినిమాల్లో నటించింది. అలాగే మోహన్ బాబు తో కూడా` రౌడీ గారు`, `అల్లుడుగారు`, `గేమ్` వంటి సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు సినిమాలతో పాటు, తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు మళ్లీ 18ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ, `కల్కి`లో నటిస్తుండటం విశేషం.  

Latest Videos

click me!