మహేష్ బాబు వాడే లగ్జరీ బ్యాగ్ చూశారా..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే...?

First Published Jun 15, 2024, 7:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు  తన కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్ళినా.. ఓ విషయాన్ని మీరు గమనించారా..? అదే ఆయనవాడే బ్యాగ్.. మహేష్ వాడే బ్యాగ్ ను గమించారా..? ఆ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా..? తెలిస్తే నిజంగా షాక్అవుతారు..?  
 

తాజాగా మరోసారి ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ కు బయలుదేరాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శంషాబాద్  విమానాశ్రయంలో ఫ్యామిలీతో కలిసి ఆయన  విహారయాత్రకు వెళుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే సినిమాలు, షూటింగ్ లు.. లేకుండా ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్పులు.. ఇవే మహేష్ బాబు ప్రపంచం. అయితే ఈసారి ట్రిప్పు వెనకాల కారణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది. 

Mahesh Babu and Rajamouli

టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఆయన ప్రస్తుతం  ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను దాదాపు కంప్లీట్ చేశాడు జక్కన్న.

నాగార్జున ఆ హాట్ హీరోయిన్ తో.. ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి..? 

ఇక మహేష్ బాబుకు ఏమాత్రం గ్యాప్ దొరికినా.. తన ఫ్యామిలీని వెంటేసుకుని వెంటనే ఫారెన్ ప్లైట్ఎక్కేస్తుంటాడు. ఈ నేపధ్యంలో  మహేష్ బాబు కుటుంబ సమేతంగా తాజాగా ఫారెన్ ట్రిప్ కు వెళ్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శంషాబాద్  విమానాశ్రయంలో వీరు సందడి చేశారు.  ఫోటోలో, మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార మరియు కుమారుడు గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడం చూడవచ్చు. 

మోడీకి చిరంజీవి అంటే ఎందుకంత ఇష్టం ..? గతంలో కూడా మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన ప్రధాని..?

ఇక మహేష్‌బాబు పొడవాటి జుట్టు మరియు గడ్డంతో, నలుపు రంగు ట్రాక్ ప్యాంట్‌తో బ్రౌన్ కోటు మరియు డార్క్ కలర్ కాంబినేషన్  టోపీతో కనిపించారు. అయితే ఇక్కడ మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేటంటే.. ప్రతీ సారి మహేష్ బాబు ట్రిప్పుకు వెళ్ళినప్పుడల్లా  తన వెంట తీసుకెళ్లిన విలాసవంతమైన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ దీని కాస్ట్ ఎంతో తెలుసా.. అక్షరాలా  3.92 లక్షలు. అంటే దాదాపు 4 లక్షల రూపాయల బ్యాగ్ అన్నమాట. 

అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ ను మెగా‌- నందమూరి ఫ్యామిలీలు దూరం పెట్టాయా..? కోల్డ్ వార్ కు కారణం ఏంటి..?

ఇక ఈ ట్రిప్పుకోసం ఎయిర్ పోర్ట్ కు వచ్చిన మహేష్ ఫ్యామిలీని కెమెరా కళ్లు క్లిక్ మనిపించాయి. మహేష్ బాబు  సితార మరియు గౌతమ్ కలిసి మాట్లాడుకుంటూ నడుచుకోవడం చూడవచ్చు. గౌతమ్ గ్రే ప్యాంట్ మరియు లేత నీలం రంగు టీ షర్ట్ వేసుకున్నాడు. సితార తెల్లటి టీ షర్ట్ మరియు ట్రాక్ ధరించి ఉంది.

నమ్రతా శిరోద్కర్ బ్లూ కలర్ కోటులో కనిపించగా... అందుకు సంబంధించిన ఫోటోను కూడా సితార తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.  అయితే ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే.. గౌతమ్ తన ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ యూనివర్సిటీలో చేరాడు. అందుకే మహేష్ బాబు మరియు అతని కుటుంబం గౌతమ్ ను అక్కడ వదిలేసి రావడానికి  న్యూయార్క్ వెళ్లినట్లు సమాచారం.

Mahesh Babu and Rajamouli

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే...  రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ మూవీ.. ఆఫ్రికాలోని అడవుల నేపథ్యంలో  ఉండబోతున్నట్టు తెలుస్తోంది. భారీ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతుందట.  హనుమంతుని ఆధారంగా మహేష్ బాబు పాత్రను రూపొందించబోతున్నారని వినికిడి. ఇక ఈసినిమా షూటింగ్ కు సబంధించి అధికారికంగా సందడి స్టార్ట్ కాలేదు. 

Latest Videos

click me!