4 నెలల గర్భంతో ఉన్నా ఎన్టీఆర్ తో మాస్ డ్యాన్స్ చేశా..17 ఏళ్ళ తర్వాత మ్యాటర్ లీక్ చేసిన రమ్యకృష్ణ

First Published Oct 6, 2022, 2:12 PM IST

సీనియర్ నటి రమ్యకృష్ణ నటన, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో ఒక ఊపు ఊపిన రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయసుకి తగ్గ పాత్రల్లో దూసుకుపోతోంది.

సీనియర్ నటి రమ్యకృష్ణ నటన, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో ఒక ఊపు ఊపిన రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయసుకి తగ్గ పాత్రల్లో దూసుకుపోతోంది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర రమ్యకృష్ణ స్థాయిని మరింతగా పెంచింది. 

ఒకప్పుడు రమ్యకృష్ణ గ్లామర్ కి, ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ కి కుర్రాళ్లు పడి చచ్చేవారు. రమ్యకృష్ణ ప్రస్తుతం ఐకాన్ డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో తన గురించి ఒక హాట్ సీక్రెట్ ని రమ్యకృష్ణ బయటపెట్టారు. ఈ షోలో కంటెస్టెంట్లు రమ్యకృష్ణ సాంగ్ కి డ్యాన్స్ చేసి మెప్పించారు. ఆ సాంగ్ ఏంటంటే.. సయ్యా సయ్యారే అంటూ సాగే నా అల్లుడు చిత్రంలోని మాస్ సాంగ్. 

డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసిన వారిని రమ్యకృష్ణ అభినందిస్తూ.. ఈ సాంగ్ కి డ్యాన్స్ చేసే సమయంలో నేను నాలుగు నెలల గర్భవతిని అని తెలిపారు. అందుకే ఈ పాటని నేను అంత త్వరగా మరచిపోను. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ ఎనెర్జీ, మాస్ స్టెప్పులు మరో స్థాయిలో ఉంటాయి అని రమ్యకృష్ణ రివీల్ చేసింది. 

ఎన్టీఆర్, జెనీలియా, శ్రీయ శరన్ జంటగా నటించిన నా అల్లుడు చిత్రం 2005లో విడుదలయింది. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఆ సాంగ్ ఒక ఊపు ఊపింది. పొగరు బోతు అత్తగా రమ్యకృష్ణ నటించింది. ఈ పాటలో ఎన్టీఆర్ తో కలసి రమ్యకృష్ణ, శ్రీయ, జెనీలియా ముగ్గురూ డ్యాన్స్ చేస్తారు. 

సినిమా విడుదలైన 17 ఏళ్ల తర్వాత ఆ మ్యాటర్ ని రమ్య కృష్ణ లీక్ చేయడం విశేషం. సింహాద్రి చిత్రంలో కూడా రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసింది. రమ్యకృష్ణ ఇప్పటికి చెరగని అందంతో ఆకట్టుకుంటోంది. 

రమ్యకృష్ణ చివరగా లైగర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఐకాన్ షోలో రమ్యకృష్ణ గ్లామరస్ శారీస్ లో మెరుస్తూ అందంతో చూపు తిప్పుకోలేని ఫోజులు ఇస్తోంది. 

click me!