రష్మిని పోర్న్ స్టార్ మియా ఖలీఫా తో పోల్చిన రామ్ ప్రసాద్, స్టార్ యాంకర్ రియాక్షన్ ఏంటంటే..?

First Published Dec 29, 2022, 9:51 AM IST

ప్రతీ వారంలాగే ఈవారం కూడా బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెని ప్రొమో రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రొమోలు ఓ వివాదాస్పద డైలాగ్ వినిపించింది. యాంకర్ రష్మిపై పొరపాటున నోరు జారాడు స్టార్ కమెడియన్ రామ్ ప్రసాద్. 

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రొమో రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే ఇంట్రెస్టింగ్ కామెండీ ఎలిమెంట్స్ తో పాటు.. పంచుల ప్రవాహంతో ప్రోమో ఆడియన్స్ ను అలరిస్తుంది. అయితే రాను రాను కాస్త కాంట్రవర్సీల  కలర్ కూడా పులుముకుంటుంది ఈ షో. 
 

కావాలని అన్నాడా.. లేక ఏదో అలా ప్లోలో వచ్చిందా.. తెలియదు కాని.. స్టార్ యాంకర్ రష్మీని ఓ పోన్ స్టార్ తో పోల్చాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ రామ్ ప్రసాద్. రష్మి పోర్న్ స్టార్ మియా ఖలీఫాలా ఉందంటూ.. కామెంట్ చేశారు.

పోర్న్ స్టార్ గా మియా ఖలీఫా గురించి చాలా మందికి తెలుసు. ఇంకెవరైనా హాలీవుడ్ స్టార్ తో రష్మిని పోల్చి ఉంటే ఏమో కాని..మరీ పోర్న్ స్టార్ తో పోల్చడంతో.. ఒక్క సారిగా అక్కడివారంత స్టన్ అయ్యారు. 

ఈ కామెంట్ తో ఒక్క సారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ షో జడ్జి ఇంద్రజ షాక్ లో ఉండిపోయారు. రష్మి మాత్రం రకరకాల ఎక్స్ ప్రెషన్స్ పెట్టి స్టన్ అయ్యింది. అయితే సీరియస్ మాత్రం అవ్వలేదు. లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది. 

ఈక్రమంలోనే ఇంద్రజ మాత్రం తన చేతిలో ఉన్న బెత్తంతో రామ్ ప్రసాద్ ను కొట్టారు. ఈ సీన్ అంతా కామెడీగానే వెళ్లిపోయినా.. చూసేవాళ్లకు మాత్రం ఇదేంటి ఇంత మాట అన్నాడు.. రష్మి ఈ విషయంలో కామ్ గా ఉందేమిటి అన్న అనుమానాలు వస్తున్నాయి. 
 

తెరపై ఏం మాట్లాకపోయినా.. ఆతరువాత కాస్తైనా క్లాస్ పీకకుండా ఉంటుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీదేవీ డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు ఇలాంటి పదనిసలు కామన్ అవుతున్నాయి. ఈ విషయంలో విమర్షలు కూడా తప్పడంలేదు. 

ఇక ఎప్పటి లాగానే ఈ వీక్ కూడా ప్రోమో అలరించింది. కమెడియన్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి.. తమ బాల్యంలోకి వెళ్లిపోయారు. ఒకరిపై మరొకరు పంచ్ లు విసురుకుంటూ రెచ్చిపోయారు. షో మొత్తం మీద తాగుబోతు రమేష్ తో పాటు ఇమ్మాన్యూయల్ హైలెట్ గా మారారు. 

click me!