HBD Vijay Devarakonda: మూడు చిత్రాలు ప్రకటించిన రౌడీ హీరో... చాలా డిఫరెంట్ సబ్జక్ట్స్!

Published : May 09, 2024, 01:28 PM IST
HBD Vijay Devarakonda: మూడు చిత్రాలు ప్రకటించిన రౌడీ హీరో... చాలా డిఫరెంట్ సబ్జక్ట్స్!

సారాంశం

విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మూడు కొత్త చిత్రాలు ప్రకటించాడు. ఒక్కో చిత్రం ఒక్కో జోనర్లో తెరకెక్కుతుంది. ప్రకటన పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి.   

నేడు విజయ్ దేవరకొండ జన్మదినం. 1989 మే 9న జన్మించిన విజయ్ దేవరకొండ 35వ ఈటా అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులు  వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నేడు మూడు ప్రాజెక్ట్స్ ప్రకటించాడు విజయ్ దేవరకొండ. వీటిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. 

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది. ఇవాళ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.

బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది.

ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు విజయ్ దేవరకొండ. చేశాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ మరో ప్రాజెక్ట్ దిల్ రాజు ప్రకటించారు. రవి కిరణ్ కోలా ఈ చిత్ర దర్శకుడు. 'కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే' అనే ఆసక్తికర కొటేషన్ పోస్టర్ కి జోడించారు. కత్తి పట్టుకున్న చేత్తో కూడిన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. 

ఆల్రెడీ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. వరుస పరాజయాలు ఎదురవుతున్నా విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గడం లేదు అనడానికి ఇది నిదర్శనం.. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా