మీరు ఈ మార్గం ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది.. పవన్ కి అల్లు అర్జున్ మద్దతు

Published : May 09, 2024, 07:38 PM IST
మీరు ఈ మార్గం ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది.. పవన్ కి అల్లు అర్జున్ మద్దతు

సారాంశం

జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు కూడా తోడైంది. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పవన్ కి ఇటు ఫ్యామిలీ నుంచి అటు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.

జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు కూడా తోడైంది. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పవన్ కి ఇటు ఫ్యామిలీ నుంచి అటు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. కొందరు పవన్ కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుంటే మరికొందరు డైరెక్ట్ గా గ్రౌండ్ లో దిగి ప్రచారం చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా కుటుంబ సభ్యులంతా జనసేన పార్టీ విజయం సాధించాలని ఏదో విధంగా సపోర్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

రానున్న ఎన్నికల ప్రయాణంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరుసేవకి మీ జీవితాన్ని అంకితం చేసే మార్గం  ఎంచుకున్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరు కోరుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నట్లు బన్నీ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. బన్నీ స్వయంగా భీమవరం వెళ్లి 2019లో పవన్ కి సపోర్ట్ గా నిలిచారు. కానీ గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చెందింది. ఈ సారి జనసేనాని, జనసేన పార్టీ బలమైన విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన