ఆర్బీఐ బిగ్ అలర్ట్.. PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!

By Rajesh Karampoori  |  First Published May 9, 2024, 7:14 PM IST

యూపీఐ సేవల్లో ఫోన్ పే, గూగుల్ పే, బీహెచ్ఐఎం, పేటీఎం లాంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా చెల్లిస్తున్న నగదు పై ఆర్బీఐ ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం.


ఈ మధ్యకాలంలో చాలామంది ఏ వస్తువును కొన్నా స్మార్ట్ ఫోన్  నుంచి ఆన్ లైన్ పేమెంట్స్ తో బిల్ పే చేస్తున్నారు. అంతే కాదు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా డిజిటల్ చెల్లింపుల ద్వారానే ఇచ్చేస్తున్నారు. ఈ యూపీఐ సేవల్లో ఫోన్ పే, గూగుల్ పే, బీహెచ్ఐఎం, పేటీఎం లాంటి అనేక డిజిటల్ యాప్ లను వినియోగించి ఎలాంటి లిమిట్ లేకుండా లావాదేవీలు చేస్తున్నారు. ఇకపోతే మనదేశంలో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సిస్టమ్ కు ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ని కనెక్ట్ చేయడం ద్వారా యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. అయితే ఈ యాప్ ల ద్వారా చెల్లిస్తున్న నగదు పై పరిమితులు విధించనున్నట్లు సమాచారం.

అయితే యాప్ ల వాల్యూమ్ 30 శాతానికి పరిమితి చేసేందుకు ప్రతిపాదిత గడువును డిసెంబర్ 31 వరకు అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్చలు జరపుతోంది. ప్రస్తుతానికైతే వాల్యూమ్ క్యాప్ లేదు. ఇకపోతే ఫోన్ పే, గూగుల్ పే మార్కెట్ సుమారుగా 80 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

Latest Videos

undefined

డిజిటల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులను తగ్గించేందుకు 2022 లో ఎన్పీసీఐ 30 శాతం మార్కెట్ క్యాప్ ను ప్రతిపాదించడంతో వాటాను పరిమితం చేసేందుకు రెండు సంవత్సరాల గడువును ఇచ్చింది. గడువు 2023 డిసెంబర్ లో ముగిసినా మార్కెట్ క్యాప్ లు అమలు కాలేదు. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ అమలు చేసేందుకు సర్య్యూలర్ విడుదల చేసింది.  

ఇదిలా ఉంటే 2024 ఏప్రిల్ లో ఫోన్ పే లావాదేవీలను యూపీఐ మార్కెట్ సుమారుగా 49 శాతం వాటాతో నడిపించింది. యూపీఐ లావాదేవీలలో ఫోన్ పే 2020 నుంచి నెంబర్ వన్ గా ఉంది. ఇక గూగుల్ పే విషయానికి వస్తే 38 శాతం మార్కెట్ వాటాను పొందింది. ఇక పేటీఎం విషయానికి వస్తే  యూపీఐ ఎకో సిస్టమ్ లో ఏప్రిల్ నెలలో 8.4 శాతానికి మార్కెట్ వాటా డౌన్ అయ్యింది.

click me!