ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్న సూపర్ స్టార్స్... సినిమాలను మించిన ప్రేమకథలు!

First Published Apr 19, 2021, 3:46 PM IST

ఆకాశం భూమి కలవడం సాధ్యమా అంటే అసాధ్యం అంటారు. కోట్ల మంది అభిమానులు కలిగిన స్టార్స్ ఓ సాధారణ అభిమానిని పెళ్లి చేసుకోవడం కూడా అసాధ్యమే. కానీ అలాంటి అసాధ్యం సుసాధ్యం చేసి చూపించారు కొందరు స్టార్స్.

వారి స్టార్డమ్, స్టేటస్ మరచిపోయి నచ్చిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచారు. ప్రేమకు అంతరాలు ఉండవని నిరూపించారు. రజినీ కాంత్, విజయ్, మాధవన్ లతో పాటు మరికొందరు ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ కథల సంగతి తెలుసుకుందాం.
undefined
రజినీకాంత్ స్టార్డం, మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు. దేశంలోనే మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ఆయన. అలాంటి రజినీకాంత్ ఓ సాధారణ అభిమాని ప్రేమలో మొదటి పరిచయంలోనే పడ్డారు.
undefined
యెతిరాజ్ ఉమెన్స్ కాలేజ్ కి చెందిన లత రంగాచారి అనే యువతి తమ కాలేజ్ మ్యాగజైన్ కోసం రజినీ కాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఆ సమయంలో లత అందానికి, మాటతీరుకు రజినీ పడిపోయారు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం అన్నారట. ఆ విషయం పెద్ద వాళ్లకు చెప్పి ఒప్పించి, లత రజిని భార్య అయ్యారు. 1981లో తిరుపతి దేవస్థానంలో వీరి వివాహం జరిగింది.
undefined
కోలీవుడ్ లేటెస్ట్ సూపర్ స్టార్ విజయ్. ఇళయదళపతిగా ఫ్యాన్స్ పిలుచుకునే విజయ్ బాక్సాఫీస్ కింగ్. రెండు దశాబ్దాలుగా విజయ్ కోలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. ఈ స్టార్ హీరో తన అభిమాని సంగీత సూర్నలింగంని వివాహం చేసుకున్నారు.
undefined
ఓ షూటింగ్ కోసం బ్రిటన్ వెళ్లిన విజయ్ ని సంగీత కలిశారు. అభిమానిగా ఆయనకు  పరిచమైన సంగీత విజయ్ ని ఆకర్షించారు. ఆమె మాట తీరు నచ్చిన విజయ్ ఆమెకు ఫోన్ నంబర్ ఇచ్చారట. అలా వారి పరిచయం ప్రేమగా మారి, పెళ్ళికి దారితీసింది. శ్రీలంక తమిళియన్ అయిన సంగీతను 1999లో విజయ్ వివాహం చేసుకున్నారు.
undefined
లవర్ బాయ్ ఇమేజ్ తో కోలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన మాధవన్ ప్రస్తుతం వయసుకు తగ్గ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. కాగా మాధవన్ కూడా తన అభిమానినే పెళ్లి చేసుకున్నారు. డిగ్రీ పూర్తి అయిన తరువాత మాధవన్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ గురించి దేశవ్యాప్తంగా అనేక వర్క్ షాప్స్ నిర్వహించారు.  మాధవన్ ప్రెసెంటేషన్ కి అటెండ్ అయిన సరితా.. అతని పట్ల ఆకర్షితురాలయ్యారు.
undefined
మాధవన్ టిప్స్, వర్క్ షాప్ ఆమె ఎయిర్ హోస్టెస్ జాబ్ ఇంటర్వ్యూ పాస్ కావడానికి ఉపయోగపడిందట. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది. 1999లో వీరి వివాహం జరిగింది. అప్పటికి మాధవన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేదు.
undefined
హీరోయిన్ ఈషా డియోల్ కూడా తన అభిమాని పెళ్లాడిన స్టార్స్ లిస్ట్ లో ఉన్నారు. బిజినెస్ మాన్ భరత్ తక్తానీ ఈషా డియోల్ కి వీరాభిమాని. ఓ సందర్భంలో ఈషాను కలిసిన భరత్ తన ప్రేమను ఆమెతో వెల్లడించాడట. ఆమెకు కూడా అంగీకరించడంతో వీరు పెళ్లిచేసుకున్నారు.
undefined
బాలీవుడ్ స్టార్ హీరో రాజేష్ ఖన్నా తన అభిమాని డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్నారు. డింపుల్ కపాడియా హీరోయిన్ అయినప్పటికీ రాజేష్ ఖన్నాకు బిగ్ ఫ్యాన్. డింపుల్ కపాడియా పరిశ్రమకు వచ్చిన ఏడాదిలోపే ఆమె రాజేష్ ఖన్నాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కూతరు ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ భార్య.
undefined
click me!