`పుష్ప2`, `దేవర`, `గేమ్‌ ఛేంజర్‌`, `విశ్వంభర`.. ఓవర్సీస్‌ రైట్స్.. ఎవరు కింగ్‌ అంటే?

First Published Jan 28, 2024, 5:22 PM IST

తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌(విదేశాలు) పెద్ద మార్కెట్‌గా విస్తరించింది. అక్కడ మన సినిమాలు కలెక్షన్ల దుమ్మురేపుతున్నాయి. మరి ప్రస్తుతం రాబోతున్న సినిమాల్లో ఏది ఎంతకు అమ్ముడు పోయిందంటే..
 

టాలీవుడ్‌లో మంచి హైప్‌ ఉన్న చిత్రాలు `పుష్ప2, `దేవర`, `గేమ్‌ ఛేంజర్‌`, `విశ్వంభర`, `కల్కి` వంటి సినిమాలున్నాయి. అయితే `కల్కి` బిజినెస్‌ ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ మిగిలిన సినిమాలు చాలా వరకు బిజినెస్‌ ముందుగానే జరుగుతుంది. తెలుగుతోపాటు, ఇతర స్టేట్స్, ఓవర్సీస్‌లోనూ బిజినెస్‌లు జరుగుతున్నాయి. అయితే ఓవర్సీస్‌ బిజినెస్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందరి చూపుని ఆకర్షించేలా చేస్తున్నాయి. మరి వీటిలో ఏ మూవీ ఎంత పలికింది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో కింగ్‌ ఎవరు అనేది చూస్తే.. 

గత నెలలో వచ్చిన ప్రభాస్‌ `సలార్‌` ఓవర్సీస్‌లో దుమ్మురేపింది. అక్కడ ఇది 72కోట్లకు అమ్ముడు పోయింది. ఈ మూవీ 140కోట్ల వసూలు చేసింది. బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరకు వచ్చింది. ఇక అంతకు ముందు `బాహుబలి2` 70కోట్లకు అమ్ముడు పోయింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`68కోట్లు పలికింది. సినిమాలు ఓవర్సీస్‌లో అత్యధికంగా పలికిన చిత్రాలుగా ఉన్నాయి. 
 

Latest Videos


ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్‌ చేశాడు అల్లు అర్జున్‌. ఆయనహీరోగా నటిస్తున్న `పుష్ప2` అక్కడ భారీగా పలికింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ 90కోట్లు పలుకుతుందని సమాచారం. అయితే ఈ డీల్‌ ఇంకా పూర్తయిందా లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే తెలుగు హీరోల్లో బన్నీదే రికార్డు. ఆయనే కింగ్ అని చెప్పాలి. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కానుంది. 
 

ఇక మన తెలుగులో రాబోతున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ఎన్టీఆర్‌ `దేవర` కూడా ఉంది. ఇది భారీ బడ్జెట్‌తో, భారీ హైప్‌తో రూపొందుతుంది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీ ఓవర్సీస్‌లో చాలా తక్కువే పలికింది. 27కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఓవర్సీస్‌లో ఎన్టీఆర్‌కి మార్కెట్‌ తక్కువగానే ఉందని దీనిబట్టి అర్థమవుతుంది. పైగా సోలోగా ఆయన్నుంచి సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. దీంతో ఆయన మార్కెట్‌ పెరగలేదని  ట్రేడ్‌ వర్గాల టాక్‌. ఇక `దేవర` మూవీ ఈ దసరాకి(అక్టోబర్ 9)న విడుదల కానుందని తెలుస్తుంది. ఏప్రిల్‌ 5న ఈ మూవీని రిలీజ్‌ చేయాలని భావించారు, కానీ వాయిదా వేస్తున్నట్టు సమాచారం. 
 

Game Changer

ఈ ఏడాది మన తెలుగులో రాబోతున్న పెద్ద సినిమాల్లో రామ్‌చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` కూడా ఉంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం విశేషం. ఈ మూవీ ఓవర్సీస్‌లో 20కోట్లకు అమ్ముడైందని సమాచారం. ఈ మూవీని సెప్టెంబర్‌ చివరి వారంలో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాత దిల్‌రాజు. 
 

Vishwambhara

ఈ ఏడాది వచ్చే పెద్ద సినిమాల్లో చిరంజీవి `విశ్వంభర` కూడా ఉంది. సోషియో ఫాంటసీగా ఇది రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఓవర్సీస్‌ రైట్స్ క్లోజ్‌ అయ్యిందట. అక్కడ ఇది 18కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభమైన ఈ మూవీని దసరాకి విడుదల చేసే అవకాశం ఉంది. 

click me!