ఆదిపురుష్  బాగానే ఆడింది, అవి పట్టించుకోను... మొదటిసారి నోరు విప్పిన ఓం రౌత్!

By Sambi Reddy  |  First Published Aug 29, 2024, 11:40 PM IST

ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ప్రభాస్ సైతం విమర్శలపాలయ్యాడు. అయితే ఆదిపురుష్ సూపర్ హిట్ అంటున్నాడు ఓం రౌత్.


ఆదిపురుష్ మూవీ తీవ్ర వ్యతిరేకతకు గురైంది. దర్శకుడు ఓం రౌత్ ఆధునిక రామాయణం పేరుతో ప్రయోగం చేశాడు. ఆదిపురుష్ లో ప్రధాన పాత్రల గెటప్స్, సన్నివేశాలు, డైలాగ్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ తీర్చిదిద్దిన తీరు విమర్శలపాలైంది. ఆయన తన వాహనానికి మాంసం ఆహారంగా పెట్టడాన్ని పలువురు తప్పుబట్టారు. బ్రాహ్మణుడు, పరమ శివ భక్తుడైన రావణాసురుడు మాంసం ముట్టుకోవడం ఏమిటంటూ ఫైర్ అయ్యారు. 

చెప్పాలంటే ఆదిపురుష్ మూవీలోని చాలా అంశాలపై అసహనం వ్యక్తమైంది. ఇక నాసిరకం గ్రాఫిక్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం నిరాశకు గురయ్యారు. ఆదిపురుష్ లో రాముడి పాత్ర చేసిన ప్రభాస్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఆదిపురుష్ ఫలితం పై మొదటిసారి పెదవి విప్పాడు ఓం రౌత్. ఆయన దృష్టిలో ఆదిపురుష్ సూపర్ హిట్ అట. ఓ మరాఠా షోలో పాల్గొన్న ఓం రౌత్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

Latest Videos

ఓం రౌత్ మాట్లాడుతూ... ఒక సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పని తీరు వేరు. ఆదిపురుష్ మూవీ అందుకు ఉదాహరణ. ఈ చిత్రం ఫస్ట్ డే ఒక్క ఇండియాలోనే రూ. 70 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ. 400 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ లెక్కన ఆదిపురుష్ బాగానే ఆడినట్లు లెక్క. ఆదిపురుష్ వలన డబ్బులు పోలేదు. కానీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 

కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేశారు. అవి నేను పట్టించుకోను. ఇక సల్మాన్, ప్రభాస్ ల ఇమేజ్ ఎన్ని ప్లాప్స్ పడినా చెక్కు చెదరదు. వారికి భారీగా అభిమానులు ఉన్నారు, అని అన్నారు. ఓం రౌత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్ ఆదిపురుష్ కి కేటాయించారు. అనంతరం విడుదలైన హనుమాన్ బడ్జెట్ రూ. 50-60 కోట్లు కాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన విజువల్స్ అందించాడు. హనుమాన్ మూవీ చూసిన ఆడియన్స్ ఓం రౌత్ ని మరింతగా ట్రోల్ చేశారు. 

click me!