నాగబాబు అప్పు తీర్చటం కోసమే ‘గ‌బ్బ‌ర్ సింగ్’ ,ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన పవన్

First Published Sep 3, 2024, 8:38 AM IST

 తన అన్నని ఎలాగైనా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కి ఉంది. అందుకోసం ఓ సినిమా చేయాలనుకున్నారు.

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau


 పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన బ్లాక్ బస్టర్ గబ్బర్‌సింగ్‌ (Gabbar singh). ఈ  చిత్రం 2012లో విడుదలైన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. సెప్టెంబన్‌ 2న పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం రీ రిలీజ్‌ అయ్యింది.  ఈ నేపథ్యంలో చిత్రానికి సంభందించిన విశేషాలు కొన్ని బయిటకు వచ్చి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ సినిమా నాగబాబు ని ఫైనాన్సియల్ గా నిలబెట్టిన వైనం. ఆ వివరాలు చూద్దాం.


ఈ సినిమా చేసేనాటికి నాగబాబు ఆర్దిక పరిస్దితి ఏ మాత్రం బాగోలేదు. తన అన్నని ఎలాగైనా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కి ఉంది. అందుకోసం ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ లాభాలు తో నాగబాబుని ఒడ్డున పడేయాలనుకున్నారు. కొన్ని ప్రాజెక్టులు అనుకున్నారు కానీ అవి మెటీరియలైజ్ కాలేదు. ఈలోగా ఆయన దృష్టిలో దబాంగ్ రీమేక్ పడింది. మొదట వద్దనుకున్నా తర్వాత పూర్తి స్దాయి మార్పులుతో చేస్తే వర్కవుట్ అవుతుందనుకున్నారు.
 

Latest Videos


pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau



దాంతో గబ్బర్ సింగ్ ని తన ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ ద్వారా ఈ సినిమాని రీమేక్ చేసి, వ‌చ్చిన లాభాలు నాగ‌బాబుకు ఇద్దామ‌నుకొన్నారు. అయితే అదే స‌మ‌యంలో తన అభిమాని బండ్ల గ‌ణేష్ తనతో ‘తీన్ మార్‌’ తీసి న‌ష్టపోయి ఉన్నాడు. అతన్ని సపోర్ట్ చేయాలనే ఆలోచన. వెంటనే బండ్ల‌ గణేష్ ని పిలిచి ‘ద‌బాంగ్’ సినిమా రీమేక్ చేద్దామని ప్రపోజల్ పెట్టారు. నిర్మాత‌వు నువ్వే. నాకు  రెమ్యునేషన్ వ‌ద్దు. ప్రాఫెట్ లో షేర్  కావాలి’ అన్నారు. బండ్ల‌ మారు మాట్లాడకుండా ఓకే చెప్పేసారు.
 

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau



ఇక దర్శకుడుగా హ‌రీష్ శంక‌ర్ ని ఎంచుకున్న తర్వాత అతను  స్క్రిప్టులో  చేసిన మార్పులు చేర్పులు అదిరిపోయాయనిపించింది. షూటింగ్ జరిగేటప్పుడు సెట్లో వస్తున్న రెస్పాన్స్ చూసి బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేసారు పవన్. ఇటు హరీష్, అటు బండ్ల ఇద్దరూ కూడా సినిమాని ఎలాగైనా పెద్ద హిట్ చేయాలనే ఉత్సాహంలో కష్టపడుతున్నారు. దాంతో బండ్ల గణేష్ ని పిలించి మరో ప్రపోజల్ పెట్టారు.
 


పవన్ కళ్యాణ్ ..బండ్ల గణేష్ తో .. ‘నాకు ఈ సినిమాలో షేర్  వ‌ద్దు.  ప్రాఫిట్ మొత్తం నువ్వే తీసుకో. రెమ్యునరేషన్ ఇస్తే చాలు’ అని అన్నారు. అలా తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తం నాగ‌బాబుకే ఇచ్చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau

ఈ విషయమై పవన్ కల్యాణ్ గతంలో  కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "నిజానికి గబ్బర్ సింగ్ సినిమా నాకు అవసరం లేకుండా వచ్చింది. ఔట్ ఆఫ్ నెసెసిటీ నాకు దబాంగ్ సినిమా చూపించారు. దబాంగ్ రిలీజైన రెండు, మూడు నెలలకు నాకు చూపిస్తే అది ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. సల్మాన్ ఖాన్ పర్సనల్ ఉంది, ఆయన వ్యక్తిత్వం ఏదో ఉంది. మాములుగా కథలో తల్లి ఉంటుంది, ఇలా ఉంటుంది. కొత్తగా ఏముంది ఇందులో అనుకుని నేను చేయలేదు" అని పవన్ కల్యాణ్ తెలిపారు.


"కానీ సినిమా చేసాను దానికి కారణం ఏంటంటే.. మా బ్రదర్‌కు ఏదో సమస్యలు ఉంటే.. ఏదో ఫిల్మ్‌కు సంబంధించి ఫినాన్షియల్ సమస్యలు ఉంటే ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. వెంటనే సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి. అప్పుడు అది నాకు అవసరం అనిపించి చేశాను" అని పవన్ కల్యాణ్ బదులిచ్చారు.


అలాగే చాలా ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. వాళ్లకోసం సినిమా చేయాలి. ఎలాంటి సినిమా చేయాలి. ఏ సినిమా చేస్తే సేఫ్ అవుతాం. చాలా త్వరగా అయిపోవాలి. అప్పుడు ఆలోచిస్తే దబాంగ్ గుర్తుకు వచ్చింది. మళ్లీ ఓసారి చూద్దాం అని చూశాను" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.


నాగబాబు మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ బ్రదర్ దగ్గర దబాంగ్ రైట్స్ తీసుకున్నాము. ప్రాఫిట్స్ లో అన్నయ్య అప్పులు తీర్చేసి ఆ తర్వాత నాకేమన్నా వస్తే రెమ్యునరేషన్ ఇవ్వు లేకపోతే లేదు అని పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. దానికి గణేష్ ఓకే అన్నాడు. సినిమా బాగా వచ్చింది. అయితే పవన్ మళ్ళీ రిలీజ్ కి ముందు సినిమా చూసి గణేష్ కి ఇచ్చిన ప్రపోజల్ మార్చేశాడు. సినిమా హిట్ అవుతుంది, నీ ప్రాఫిట్స్ నువ్వు తీసుకో, నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు.


 దాంతో మా అన్నయ్య అప్పులు నేను తీర్చుకుంటాను. నువ్వేమి మా అన్నయ్య అప్పులు తీర్చిద్దు అని చెప్పాడు. గణేష్ దానికి కూడా సరే అన్నాడు. ఆ సినిమాకు లాభాలు చాలానే వచ్చాయి. పవన్ తన రెమ్యునరేషన్ తో నా అప్పులు మొత్తం తీర్చేసాడు. నా అప్పులు తీర్చడానికే పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేసాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ కూడా ఫైనాన్షియల్ గా కష్టాల్లోనే ఉన్నాడు. అయినా నా కోసం నిలబడ్డాడు అని తమ్ముడి గురించి గొప్పగా చెప్పాడు. 
 

click me!