'స్వాగ్' టీజర్ చూశారా.. శ్రీవిష్ణు, రీతూ వర్మ మధ్య ఆ విషయంలో ఆధిపత్య పోరు

By tirumala AN  |  First Published Aug 29, 2024, 9:27 PM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రాలు నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. 


యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రాలు నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. శ్రీ విష్ణు చివరగా సామజవరగమన మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఓం భీం బుష్ కూడా పర్వాలేదనిపించింది. రెగ్యులర్ కామెడీ చిత్రాలు కాకుండా అందులోనే వెరైటీ అంశంతో శ్రీవిష్ణు ఆకట్టుకుంటున్నాడు. 

శ్రీవిష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం స్వాగ్. హషిత్ గోలి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలయింది. శ్రీ విష్ణుకి జోడిగా ఈ చిత్రంలో రీతూ వర్మ నటిస్తోంది. కొన్ని శతాబ్దాల క్రితం ఒక సామ్రాజ్యంలో రీతూ వర్మ మహారాణిగా ఉంటారు. 

Latest Videos

మగజాతి అంటే ఇష్టం లేని మహారాణి ఆమె. మగపిల్లలు పుట్టినా చంపేస్తూ ఉంటుంది. ఈ సెటప్ మొత్తాన్ని ఫన్నీగా చూపించారు. ఆ మహారాణి పొగరుని శ్రీ విష్ణు ఎలా అణిచాడు.. అసలు వీరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేది సినిమాలో ఆసక్తికర అంశం కాబోతోంది. 

శ్రీ విష్ణు, రీతూ వర్మ మధ్య స్త్రీ జాతి, మగ జాతి అధిపత్యానికి సంబంధించిన సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. శ్రీవిష్ణు కింగ్ గెటప్ లో భలే సందడి చేస్తున్నాడు. 

శ్రీ విష్ణు మల్టిపుల్ గెటప్స్ లలో కనిపిస్తున్నాడు. ప్రజెంట్ జనరేషన్ కథ కూడా ఉంది. శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తున్నాడు. టీజర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెకి ఇది రీ ఎంట్రీ చిత్రం. 

click me!