ఇక సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క రూ. 1.5 లక్షలు చెల్లిస్తున్నారట. ఈమెను ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ లో జనాలు బాగా ఫాలో అవుతున్నారు. మరో సోషల్ మీడియా స్టార్ నబీల్ అఫ్రిది కి వారానికి రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారట. శేఖర్ బాషా యాంకర్ అలాగే, ఆర్జే కూడాను. మంచి వ్యాఖ్యాత. రాజ్ తరుణ్- లావణ్య వివాదంతో మరింత పాపులర్ అయ్యాడు. ఇతడికి రూ. 2.5 లక్షలు చెల్లిస్తున్నారట.
యూట్యూబ్ బోల్డ్ వీడియోలతో కిరాక్ సీత పాప్యులర్ అయ్యింది. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలో కిరాక్ సీతకు వారానికి రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారట. బుల్లితెర ప్రేక్షకుల్లో నిఖిల్ కి పాపులారిటీ ఉంది. అతడు పలు తెలుగు సీరియల్స్ లో నటించాడు. వారానికి నిఖిల్ రెమ్యూనరేషన్ రూ. 2.25 లక్షలు అట.