NETFLIX కంటెంట్ హెడ్ కు కేంద్ర ప్రభుత్వం సమన్లు, వెబ్ సీరిస్ వివాదం, అసలేం జరిగింది?

First Published Sep 3, 2024, 7:19 AM IST

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ హెడ్‌కు సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. 

Netflix, Vijay varma, web series, IC 814: The Kandahar Hijack


నెట్ ప్లిక్స్ మరోసారి వివాదంలో పడింది. దాని కంటెంట్ హెడ్ కు సమన్లు పంపించారు. విజయ్‌ వర్మ (Vijay varma) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సిరీస్‌ ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్’ (IC 814: The Kandahar Hijack). ఈ సిరీస్‌ నేపథ్యంలో కొన్నిరోజుల నుంచి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హైజాకర్ల పేర్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ హెడ్‌కు సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది.

Why Controversy Erupts Over Netflix's IC 814: The Kandahar Hijack?


 గత రెండు రోజులుగా ట్విటర్​ లో బోయ్ కాట్​ నెటిఫ్లిక్స్​ అనే హ్యాష్​ ట్యాగ్​ ఇప్పుడు ట్రెండింగ్​ లోకి వచ్చింది. నెటిజన్లు నెట్ ప్లిక్స్  ఓటీటీ ని ఓ రేంజిలో దుమ్మెత్తిపోస్తున్నారు.‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్’  అనే టైటిల్ తో వచ్చిన  కొత్త వెబ్​ సిరీస్​ కు  స్ట్రీమింగ్ అవుతున్న ఈ సమయంలో నెట్​ ఫ్లిక్స్​ ఓటీటీ సంస్థ చిక్కుల్లో పడింది. నెట్ ప్లిక్స్ హిందువులకు వ్యతిరేకంగా ఉందంటూ నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ తో నెట్ ప్లిక్స్ ని ఆడుకుంటున్నారు. అసలేం జరిగింది. ఏ విషయంలో నెటిజన్లుకు ఇంత ఆగ్రహం కారణం ఏమిటి

Latest Videos



ఏవియేషన్‌ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌గా పేరుపొందిన కాంధార్‌ హైజాక్‌ నేపథ్యంలో దీనిని రూపొందించారు. కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్‌ ఇన్‌టూ ఫియర్’ ఆధారంగా అనుభవ్‌ సిన్హా ఈ ఘటనలకు విజువలైజ్ చేస్తూ ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్‌’ (IC 814 The Kandahar Hijack web series) వెబ్‌సిరీస్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. 


ఈ సీరిస్ లో 176 మంది ప్రయాణికులతో కాఠ్‌మాండు నుంచి దిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేస్తారు. కెప్టెన్‌ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్‌కు తీసుకెళ్లమని బెదిరిస్తారు. మరి ఆ విమానం కాబూల్‌ ఎలా చేరింది? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్‌ చేశారు? వారు చేసిన డిమాండ్‌లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది?  అనే విషయం చుట్టు ఈ సీరిస్ తిరుగుతుంది.  నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌గా ఆగస్టు 29న దీనిని విడుదల చేశారు. సినీ విశ్లేషకుల నుంచి మంచి స్పందన లభించింది.
 

IC 814

 ఈ వెబ్ సీరీస్ లో విజయ్ వర్మ, నసీరుద్ధీ షా, పంకజ్ కపూర్, కూద్ మిశ్రా, అరవింద స్వామి నటించారు. ఈ వెబ్ సీరీస్ ను అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు.  అయితే ఈ సీరిస్ లో ఓ చోట హిందువులకు వ్యతిరేకంగా దర్శకుడు వ్యవహరించారనేది నెటిజన్లు ఆరోపణ. 


 ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్‌  లో అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది డీటేయిలింగ్ ఇస్తూ అనుభవ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ కథని వివరించారు.  కథ ప్రకారం 176 మంది ప్రయాణికులతో కాఠ్‌మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేస్తారు.  అయితే ఈ వెబ్​ సిరీస్​ లో చూపిన ఉగ్రవాదుల పేర్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నాడు కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల పేర్లు..
1.- ఇబ్రహీం అక్తర్
– 2. షాహిద్ అక్తర్
– 3. సన్నీ అహ్మద్
– 4. జహూర్ మిస్త్రీ
– 5. షకీర్

కానీ అనుభవ్ సిన్హా నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’లో హైజాకర్లను-‘ భోలా- శంకర్’ అనే హిందువుల పేర్లతో చూపాడని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

హిందూ వర్గాలతోపాటు సాధారణ నెటిజన్లు కూడా అటు అనుభవ్ సిన్హాను, ఇటు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని ఓ రేంజ్​ లో తిట్టిపోస్తున్నారు. వెబ్ సిరీస్‌ల పేరుతో హిందువుల పరువు తీయడం ఆపండి అంటూ మండి పడుతున్నారు. అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే హైజాక్ జరిగినప్పుడు ఆ టెర్రరిస్ట్ లు ఒకరిని ఒకరు పిలుచుకునే కోడ్ నేమ్స్  భోళా- శంకర్.

Netflix, Vijay varma, web series, IC 814: The Kandahar Hijack


నిజంగా ఆ హైజాక్ సంఘటన జరిగినప్పుడు ఆ టెర్రరిస్ట్ లు పెట్టుకున్న కోడ్స్ నేమ్స్ ఇవి.. Chief, Doctor, Burger, Bhola,  Shankar .వీటినే సీరిస్ లోనూ వాడటం జరిగింది. అదే వివాదానికి కారణమైంది. అందుకే నెట్ ప్లిక్స్ కంటెంట్ హెడ్ కు సమన్లు ఇచ్చారని తెలుస్తోంది. 

click me!