#Adipurush:టీజర్ పై కామెంట్స్, ట్రోలింగ్, అంత దారుణంగా?

First Published Oct 3, 2022, 1:39 PM IST

సోషల్ మీడియా వేదికగా 'Disappointed' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. యానిమేషన్ సినిమా చేస్తున్నట్లు ముందే చెప్పాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.   టీజర్ లో కొన్ని షాట్స్ టెంపుల్ రన్ గేమ్ లోవి అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. 


సోషల్ మీడియాలో హీరోల అభిమానుల  మధ్య వార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న అవకాసం దొరికినా ఆడేసుకుంటుంటారు.. ముఖ్యంగా ఏదైనా పెద్ద హీరోల సినిమాల ట్రైలర్స్, టీజర్స్ రిలీజనప్పుడు ఆ సందడి  ఓ రేంజిలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే జరుగుతుంది. ఫేస్‌బుక్, ట్విటర్ అన్న తేడా లేకుండా కొన్ని రోజులు అవే ట్రెండింగ్‌ గా నడుస్తూంటాయి. అలానే.. నిన్న సాయంత్రం రిలీజైన ఆదిపురుష్ టీజర్ పై సోషల్ మీడియాలో  ట్రోల్ చేయటం మొదలెట్టారు.. అయితే అందుకు కారణాలు ఏమి చూపెడుతున్నారు..అవేంటో చూద్దాం.  


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.హిందీలో ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ కూడా..! తానాజీ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రావత్ ఈ చిత్రానికి దర్శకుడు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలై  ఏళ్ళు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.


 ఈ చిత్రానికి సంబంధించినంత వరకు ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా.!  దసరా కానుకగా ఈ చిత్రం నుండీ ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఆకాశానికి విల్లు ఎత్తి పెట్టిన శ్రీరాముని అవతారంలో ప్రభాస్ కనిపిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.


అలాగే ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఆదివారం ‘ఆది పురుష్’ టీజ‌ర్‌ ను అయోధ్య‌  లో విడుద‌ల చేశారు. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్న ఫ్యాన్స్‌కి ఈ టీజ‌ర్  నిరాశ‌ను క‌లిగించింద‌నే టాక్ సోషల్ మీడియాలో బ‌లంగా వినిపిస్తోంది. అందుకు కార‌ణం.. ప్ర‌భాస్‌, సైఫ్ ఆలీఖాన్‌ , కృతి స‌న‌న్  వంటి భారీ తారాగ‌ణాన్ని పెట్టుకుని లైవ్ యానిమేటెడ్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో ‘ఆది పురుష్’ సినిమాను తెర‌కెక్కించ‌టం ప్రేక్ష‌కుల‌కే కాదు.. ప్ర‌భాస్ అభిమానులకు కూడా ఇబ్బందిగానే మారింది.


ఈ నేపధ్యంలో యాంటి ఫ్యాన్స్ ‘ఆది పురుష్’ సినిమాపై  ట్రోలింగ్స్  మొద‌లు పెట్టేశారు. యానిమేష‌న్ సినిమాను చూస్తున్న‌ట్టుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. అస‌లే పొన్నియన్ సెల్వన్ నెగిటివ్ టాక్ తో  గుర్రుగా ఉన్న త‌మిళ తంబీలు, బాలీవుడ్ జ‌నాలు ఇంకాస్త గ‌ట్టిగానే సినిమాను ట్రోల్ చేస్తున్నారు. గ్రీన్ మ్యాట్‌లో సినిమాను తీసేసి దానికి టెక్నాల‌జీ ప‌రంగా పేర్లు చెబితే ఫ్యాన్స్‌కి ఎలా న‌చ్చుతుంద‌ని అంటున్నారు. 


గ‌తంలో సూప‌ర్ స్టార్ రజినీకాంత్ చేసిన కొచ్చడ‌యాన్‌తో ఈ సినిమాను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రావణాసుడుగా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ లుక్ ...పూర్తిగా మొఘల్ రాజులను, సుల్తాన్ లను గుర్తు చేస్తోందని, అతను హిందూ రాజని, శివ భక్తుడుని అనిపించటం లేదంటున్నారు. దానికి తోడు సుర్మా పెట్టుకుని ,గెడ్డంతో , విచిత్రమైన హెయిర్ స్టైల్ తో ఉన్నాడని విమర్శలు చేస్తున్నారు.


ఇక వానరసైన్యం...చూస్తూంటే గొరిళ్లాలు గుర్తు వస్తున్నాయని, అవి కోతుల్లాగ లేవని ఓ రేంజిలో ఆడేసుకుంటున్నారు. చిన్న టీజర్ కే ఇంత నెగిటివిటి రావటం చాలా మందికి షాక్ గురి చేస్తోంది.  మరికొంతమంది బిజేపీవాళ్లు ... కావాలనే రావాణాసుడు లుక్ ని మార్చారని, ముస్లింలా కనపడేలా చేసారని విమర్శలు చేస్తున్నారు. 


 లీడ్ క్యారెక్టర్స్ ను కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి చూపించారు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా 'Disappointed' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. యానిమేషన్ సినిమా చేస్తున్నట్లు ముందే చెప్పాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీజర్ లో కొన్ని షాట్స్ టెంపుల్ రన్ గేమ్ లోవి అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. 


ఇక టీజర్ లలో డైలాగులు .. భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం అంటూ ప్రభాస్ వాయిస్‌తో స్టార్ట్ చేశారు. 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.. వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి.. ఆగమనం.. అధర్మ విధ్వంసం..' అనే డైలాగ్స్ అదిరిపోయాయి.

Image: Still from the teaser

సంక్రాంతి కానుకగా... వచ్చే ఏడాది జనవరి 12న  ప్రపంచవ్యాప్తంగా  త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'కు ముందు, 'ఆదిపురుష్' తర్వాత అనేలా... జనవరి 12న దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి.


రాబోయే రోజుల్లో ...వ‌రుస‌గా 'ఆదిపురుష్‌'కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఫారెన్ లో ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. 

Adipurush Teaser


ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు రూ.250 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే.. పెట్టిన బడ్జెట్ లో సగమన్నమాట. డిజిటల్ రైట్స్ తోనే ఇంత మొత్తం వచ్చిందంటే.. ఇక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి!

Adipurush


హిందీలో తన పాత్రకు ప్రభాస్ డబ్బింగ్ చెప్పలేదు అన్న విషయం తెలిసిందే.నటుడు శరద్ కేల్కర్ ఆదిపురుష్ లో ప్రబాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.గతంలో కూడా బాహుబలి చిత్రం సమయం లోనూ డార్లింగ్ పాత్రకు శరద్ నే వాయిస్ ఓవర్ అందించారు.

Adipurush teaser

ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 

click me!