ఛీ ఛీ... అందర్నీ **గుతా అంటున్న నిహారిక, బూతు పాట వదిలిన మెగా డాటర్!

First Published | May 7, 2024, 3:39 PM IST

నిహారిక కొణిదెల మూవీ నుండి కొత్త సాంగ్ వచ్చింది. సదరు సాంగ్ లో బూతుల డోస్ ఎక్కువగా ఉంది. సామాజిక సందేశం ఇస్తూనే బూతులతో ఘాటు కౌంటర్ ఇచ్చింది.. 
 

Niharika Konidela

నిహారిక కొణిదెల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. భర్తతో విడిపోయిన నిహారిక నటనపై దృష్టి పెట్టింది. అదే సమయంలో నిర్మాతగా కూడా రాణించే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక నూతన రచయితలు, దర్శకులతో మంతనాలు జరుపుతుంది. 

Niharika Konidela

నిహారిక చాలా కాలం క్రితమే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసింది. కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించడం జరిగింది. ఇటీవల కమిటీ కుర్రోళ్ళు టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించింది. మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసింది. కమిటీ కుర్రోళ్ళు మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. 


Niharika Konidela

కాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రం నుండి ఓ సాంగ్ విడుదల చేసింది. ఈ సాంగ్ ఎన్నికలను ఉద్దేశించి రూపొందించినది. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రలోభాలకు పాల్పడేవారిని, డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళను విమర్శిస్తూ చిత్రీకరించారు. ఈ సాంగ్ లిరిక్స్ లో బూతులు వాడేశారు. 
 

Niharika Konidela

డబ్బిచ్చేటోళ్లను మింగ, ఓట్లు అమ్మేటోళ్లను మింగ, ఐదేళ్లకోసారి మోసపోయే గొర్రెలను మింగ... అని నేరుగా తిట్టేశారు. ఈ మింగ అనే పదానికి ఓ పచ్చి బూతుకు పర్యాయపదంగా సోషల్ మీడియాలో వాడుతారు. మొత్తానికి నిహారిక ఎన్నికల హడావుడిని క్యాష్ చేసుకోవడానికి గట్టిగానే ప్లాన్ చేసింది.

పరోక్షంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది. ఓట్లను కొనడం, అమ్ముకోవడం తప్పని ఘాటుగా చెప్పింది. అయితే అందుకు వాడిన బూతులే దారుణంగా ఉన్నాయి. నిహారిక తన సినిమాలో ఇలాంటి బూతు సాంగ్ ఎలా పెట్టిందని నెటిజెన్స్ వాపోతున్నారు. 

ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు నటుడు పృథ్విరాజ్, నాగబాబు, ఆయన సతీమణి పద్మజ, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. 

Latest Videos

click me!