ఫస్ట్ టైం మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ పనులు మర్చిపోకుండా చేయండి

First Published May 7, 2024, 3:21 PM IST


ప్రస్తుత కాలంలో ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నా మట్టిపాత్రలను బాగా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మొదటి సారి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నట్టైతే కొన్ని పనులను ఖచ్చితంగా చేయండి. అవేంటంటే? 
 

మట్టి పాత్రలో వండిని ఫుడ్ రుచి వేరే లెవెల్ లో ఉంటుందన్న సంగతిని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మట్టి పాత్రలో వండిన ఆహారం టేస్టీగా ఉండటమే కాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నీళ్లను కూల్ గా చేయడం నుంచి కూరలు వండటం, అన్నం వండటం వరకు మట్టి పాత్రలను బాగా ఉపయోగిసతున్నారు. అయితే మట్టి కుండను మొదటి సారి ఉపయోగించే వారు కొన్ని పనులు చేయాలి. అప్పుడే దాని ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే?
 

కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడవండి

మార్కెట్ నుంచి మట్టి కుండను కొన్ని తర్వాత డైరెక్ట్ గా వాటర్ పోసి తాగకుండా.. కుండను ఇంటికి తెచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడవండి. కాటన్ క్లాత్ తో తుడవడం వల్ల కుండకు అంటుకున్న దుమ్ము తొలగిపోతుంది. 

clay pot

24 గంటలు నీటిలో నానబెట్టాలి

మట్టి కుండ బలంగా ఉండాలంటే శుభ్రమైన కాటన్ గుడ్డతో తుడిచి నీటిలో నానబెట్టాలి. మట్టి కుండను నీళ్లలో 25 నుంచి 30 గంటలు నానబెట్టడం వల్ల కుండ బలంగా ఉంటుంది. అలాగే మీరు ఏది వండినా లేదా నీటితో నింపినా అది ఎక్కువ గ్రహిస్తుంది.
 

మురికిని స్క్రబ్బర్ తో శుభ్రం చేయండి

మట్టి కుండను శుభ్రం చేయడం చాలా అవసరం. అందుకే దానిని 24 గంటల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత స్క్రబ్బర్ తో రుద్ది శుభ్రం చేయండి. స్క్రబ్బర్ తో రుద్దడం వల్ల కుండలోని మురికి శుభ్రపడుతుంది.

నూనె

మురికిని శుభ్రం చేసిన తర్వాత మట్టి కుండను ఎండలో ఆరబెట్టండి. కుండ బాగా ఆరిన తర్వాత కుండ లోపల, బయట తుడవండి. అలాగే నూనెను అప్లై చేయండి. నూనెను అప్లై చేయడం వల్ల పాత్రలు బలపడతాయి. అలాగే అవి ఎక్కువ రోజులు బలంగా ఉంటాయి. 
 

మట్టి కుండను శుభ్రం చేసిన తర్వాత ముందుగా అందులో అన్నం వండండి. మీరు మట్టి కుండను ఎక్కువ కాలం మన్నికగా చేయాలనుకుంటే అందులో ఫస్ట్ లైం అన్నం వండండి.  బియ్యం నీరు లేదా పిండి పదార్ధం పాత్రను బలంగా చేస్తుంది. మొదటిసారి అన్నం వండిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాత ఇతర పనులకు వాడండి.

click me!