అంతే కాదు... సినిమాలో డైలాగ్స్.. సాంగ్స్, పెదరాయుడు వచ్చే టైమ్ లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. సెంటిమెంట్, ఇలా ప్రతీ ఒక్క అంశం సినిమా విజయానికి దారితీశాయని చెప్పాలి. అసలు ఈసినిమా తమిళంలో ముందుగా తెరకెక్కించారు. అయితే అప్పుడు రజనీకాంత్ సలహాతో మోహాన్ బాబు ఈసినిమా హక్కులని కొనుగోలు చేశారు. తానే స్వయంగా నిర్మాతగా మారి ఈమూవీని నిర్మించాడు. మోహన్ బాబు తెలివిగా రజినీకాంత్ ను ఈసినిమాలో ఇన్వాల్వ్ చేయడంతో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది పెదరాయుడు. ఈసినిమా ఓపెనింగ్ కు అన్నగారు ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టారు.