కొనుకున్న రికార్డులు కావు.. కొట్టిన రికార్డులు.. పవన్‌ కళ్యాణ్‌ స్టామినాకవి నిదర్శనాలు.. అందుకే పవన్ స్పెషల్‌

First Published Sep 2, 2021, 9:15 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. స్టార్‌ ఇమేజ్‌కి కొత్త అర్థాన్నిచ్చిన నటుడు. `తొలి ప్రేమ`తో రికార్డులు క్రియేట్‌ చేసినా, `ఖుషీ`తో స్టార్‌ ఇమేజ్‌ పొందినా.. `గబ్బర్‌సింగ్‌`తో రికార్డుల మోత మోగించినా, `అత్తారింటికి దారేది`తో బాక్సాఫీసు స్టామినా చూపించినా అవన్నీ సహజంగా వచ్చినవేగానీ, కొనుకున్నవి కావు. 

`ఖుషి` స్టిల్స్, అరుదైన చిత్రాలు.

చాలా వరకు ఇండస్ట్రీలో కమర్షియల్‌ లెక్క, సోషల్‌ మీడియాలో వ్యూస్‌ కొనుకున్నవనే ప్రచారం జరుగుతుంది. ఫేక్‌ అకౌంట్లతో వ్యూస్‌ పెంచి బయటకు మాత్రం ఎక్కువగా చూపిస్తారని, అలాగే బాక్సాఫీసు లెక్కల్లోనూ అంతా గోల్‌మాల్‌ జరుగుతుందనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ పవన్‌ మాత్రం ఏ రికార్డ్ సృష్టించినా అది సహజంగానే జరుగుతుంది. రికార్డులను ఆయన పట్టించుకోరు. బాక్సాఫీసు కలెక్షన్లని కూడా ఆయన లెక్క చేయరు. సినిమా చేశామా? విడుదలైందా? అంత వరకే. ఆ సినిమా ఎంత వసూలు చేసిందనేది ఎప్పుడూ పట్టించుకోరు. అదే సినిమా ఫెయిల్‌ అయితే మాత్రం ఎంతో కొంత తన పారితోషికంలోనుంచి వెనక్కి ఇచ్చి నిర్మాతని ఆదుకుంటారు. అవసరమైతే వారికి మరో అవకాశాన్ని కూడా ఇస్తారు. ఇలా చాలా సినిమాలకు జరిగింది. అది పవన్‌లోని స్పెషల్‌ క్వాలిటీ.

 పవన్‌ ఏం చేసినా స్పెషల్‌. ఆయన చేసే ప్రతి విషయంలోనూ నిజాయితీ ఉంటుందని అభిమానుల నమ్మకం. అదే ఆయన్ని అందరి హీరోలతో స్పెషల్‌గా నిలిపింది. పవన్‌ ఎప్పుడూ రికార్డుల కోసం వెంటపడడు. ఆయన చుట్టూ కొనుకున్న అభిమానులు కూడా ఉండరు. నచ్చినోళ్లే చుట్టూ చేరతారు. ఎవరినీ రమ్మని అనరు, ఎవరినీ పొమ్మని కూడా చెప్పడు. 

నిజాయితీగా పవన్‌ని చేసే పనులను అభిమానించే వారే ఆయనకు అభిమానులుగా మారతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాజకీయాల్లోకి వెళ్లినా, అభిమానులు మాత్రం తగ్గలేదు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత సినిమాలు చేసినా అదే స్టామినా చూపించారు. ఇటీవల `వకీల్‌సాబ్‌`తో మరోసారి తన బాక్సాఫీసు సత్తాని చాటారు పవన్‌.

మెగా ఫ్యామిలీ హీరోగా,ముఖ్యంగా చిరంజీవి తమ్ముడిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన పవన్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. సినీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్‌ని, ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్‌ చేసుకున్నారు.  బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ కోట్లాది మంది గుండెల్లో పవర్‌ఫుల్ హీరోగా నిలిచిపోయారు. పవన్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో జాతర షురూ అయినట్లే. పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ థియేటర్స్‌లో మోత మోగాల్సిందే. ఫ్యాన్స్ పూనకాలతో ఊగి పోవాల్సిందే. ఇక వెండితెరపై పవన్ డైలాగ్స్ వింటుంటే వచ్చే ఆ కిక్కు మాటల్లో చెప్పలేమని అభిమానులే కాదు సినీ జనాలు కూడా అంటుంటారు.

తన సినిమాలోని డైలాగ్‌లతో తన రియల్‌ లైఫ్‌ మ్యానరిజాన్ని,తన పర్సనాలిటీని చాటుకుంటారు పవన్‌. సినిమా ద్వారా ఎంతో కొంత సమాజిక అంశాలను చర్చించాలని తపిస్తారు. సాధారణ జనానికి రిలేట్‌ అయ్యే విషయాలను జోడిస్తారు. ఆయన సినిమాలో జానపద పాటలు పెట్టడానికి అది కూడా ఓ కారణం. ఇలాంటి లక్షణమే ఆయన్ని జనానికి దగ్గర చేస్తుంది. అంతేకాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ ముందుంటారు. తన వద్ద ఎంత ఉంది, ఎంత ఉంచుకోవాలనే లెక్కలు ఆయనకు తెలియదు. ఉన్నదంతా ఇవ్వాలనే మనస్థత్వం ఆయనది. 
 

Pawan Kalyan

రాజకీయాల్లోకి వచ్చినా, ఆయన ఎవరి దగ్గర చేయి చాచలేదు. తాను సినిమాల ద్వారా సంపాదించుకున్నదే పార్టీని నడిపేందుకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ డబ్బు అయిపోవడంతో మళ్లీ సినిమాలు చేస్తున్నారు. పార్టీని, తన ఇంటిని నడిపించడం కోసం సినిమాలు చేస్తున్నా అని గతంలో ఆయన వెల్లడించారు. అంతేకాదు బ్లాక్‌ మెయిల్‌ చేసి, కార్పొరేట్ల వద్దనో, వ్యాపారుల వద్దనో వసూళు చేయలేదు. ఏదైనా కష్టపడి సంపాదించాలని, సొంతంగానే సంపాదించాలని నమ్మే వ్యక్తి పవన్‌. 

అందుకే పవన్‌ అభిమానుల గుండెల్లో దేవుడు. అందుకే పవన్‌ చిత్ర పరిశ్రమలో స్పెషల్‌. అందుకే పవన్‌ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. జనం కష్టాలకు కదిలిపోయే వ్యక్తి. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, వ్యక్తి ఆయన అందరి హృదయాలను గెలుచుకున్నారు. కోట్లాది మంది తెలుగు అభిమానులకు గుండెల్లో నిలిచారు. నేడు(సెప్టెంబర్‌2) పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే స్పెషల్‌. గురువారం ఆయన తన 5వ పుట్టిన రోజుని జరుపుకుంటుండటం విశేషం. 

click me!