Karthika deepam: నా పెళ్లి నువ్వే చెయ్యాలి జ్వాల.. శౌర్యకు షాకిచ్చిన నిరుపమ్!

First Published Aug 8, 2022, 8:16 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 8వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... స్వప్న ,శోభతో పాటు సౌందర్య ఇంటికి వెళ్లి శోభ, నిరుపమ్ల పెళ్లి కార్డు సౌందర్యకి ఇచ్చి పెళ్లికి ఆహ్వానిస్తుంది.సౌందర్య కోపంతో, ఏంటే కధ మళ్ళీ మొదటికి వచ్చింది? అని అనగా స్వప్న,లేదు కదా ఇప్పుడే మొదలైంది అని అంటుంది. "మీ ఇంట్లో అసలు పెళ్లి కలే లేదు,పెళ్లికూతురు మా ఇంట్లో ఉండగా కల మీ ఇంట్లో ఏముంటుంది?" అని స్వప్న అనగా సౌందర్య కోపంతో ఆ ఇన్విటేషన్ కార్డుని చింపి స్వప్న మోకానికి కొడుతుంది. నా మనవడు నిరుపమ్ కి నా, మనవరాలు హిమ కి నిర్ణయించిన ముహూర్తాన పెళ్లి జరగడం తథ్యం.దీన్ని ఎవరు ఆపలేరు అని సౌందర్య అనే సమయానికి సౌర్య అక్కడికి వస్తుంది.
 

ఆ మాటలు విని తిరిగి వెళ్ళిపోదాం అనేసరికి సౌందర్య,సౌర్యని చూసి కిందకి పిలుస్తుంది. "మొన్న నువ్వు నీ చేతులుగా న? నిరుపమ్, హిమతో పెళ్లి చేపిస్తా అన్నావు కదా ఆ మాట ఇప్పుడు తీర్చు. నువ్వే వీళ్ళని దగ్గరుండి పెళ్లి చేయు."సరే" అని చెప్పు శౌర్య అని సౌందర్య అనగా శౌర్య ,మౌనంగా అలా ఉండిపోతుంది. స్వప్న నిరుపమ్ నీ లాక్కొని తన ఇంటికి తీసుకువెళ్లిపోతుంది. దాని తర్వాత రోజు ఉదయం సౌందర్య,కార్తీక్ దీపల ఫోటో దగ్గరికి వెళ్లి "చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. మీరు వెళ్లిపోయినప్పుడే మీతో పాటు ఇంటి ఆనందాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు.
 

ఇప్పుడు మన హిమ పెళ్లి జరుగుతుంది. మీరు ఎక్కడున్నా వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి" అని అంటుంది. దాని తర్వాత హిమా అక్కడికి వచ్చి మనసులో వాళ్ళ అమ్మానాన్న ఫోటో ముందు నిల్చుని "ఇక్కడ ఇంత జరుగుతున్నా ఇంకేం చేయలేనా? ఎలాగైనా సరే నిరుపం కి ఇచ్చి పెళ్లి చేస్తాను" అని అనుకుంటుంది. దాని తర్వాత సీన్లో స్వప్న, తన భర్తతో "ఈ ఇదే మన ప్లాన్, ఈ విషయం ఇంక ఎవరికీ చెప్పొద్దు. మీరు నోరు తెరవకుండా ఊ, ఆ,అనే అనాలి. ఇంకా ఆ ఇంటికి వెళ్ళకూడదు ఇదే నా ఆర్డర్" అని భర్త చేత ఒట్టు వేయించుకుంటుంది.
 

తర్వాత శౌర్య బాధపడుతుంటే సౌందర్య అక్కడికి వెళ్లి, అంత కోపంగా నువ్వు చూస్తే నీ కన్నా డబల్ కోపంగా నేను నిన్ను చూడగలను. నీకన్నా ఒక అక్షరం ఎక్కువే నాది అని అనగా."ఒక అక్షరం ఏంటి నానమ్మ నాకన్నా అన్నీ మీకు ఎక్కువే. నాది ఆటో రేంజ్, మీది హై రేంజ్" అని శౌర్య అంటుంది. అప్పుడు సౌందర్య "నీకేం లోటు చేసాము ఇద్దరినీ ఒకేలా చూసుకుంటున్నాము కదా" అని అంటుంది.దానికి శౌర్య "నేను మధ్యలో వచ్చిన దాన్ని. నాకు తెలుస్తుంది మీరు ఎవరిని ఎలా చూసుకుంటున్నారు" అని అంటుంది.
 

ఈలోగా ఆనందరావు అక్కడికి వచ్చి నువ్వు అలా అనుకోకూడదు అని అంటాడు. అప్పుడు సౌందర్య,శౌర్యకు ఒక ఫోటో ఇచ్చి ఈ అబ్బాయి బాగున్నాడా? అని అడిగితే బాగున్నాడు అని సౌర్య అంటుంది. నాకు తెలుసు నీకు నచ్చుతాడు అని సౌందర్య అనగా ఏం నడుపుతాడు? ఆటో ఆ? లారీ ఆ? అని అంటుంది శౌర్య. నిరుపమ్ లాగే తిను కూడా డాక్టరే, మీ తాతయ్యకి తెలిసిన వాళ్ళే అని సౌందర్య అంటుంది. నాకన్నా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అని చెప్పి ఆ ఫోటో సౌందర్య చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది శౌర్య.
 

తర్వాత సీన్లో ప్రేమ్,హిమ ఆనందరావు టిఫిన్ షాప్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్,హిమనీ నువ్వు శౌర్య కోసం ఈ పెళ్లొద్దంటున్నావా? లేకపోతే నీకు నిజంగానే ఇష్టం లేదా? అని అడుగుతాడు. సౌర్య కోసం త్యాగం చేస్తున్నాను అంటే ప్రేమ్ నాకు సహాయం చేయడేమో? అని హిమ మనసులో అనుకోని నిజంగానే నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఈ మాటలన్నీ కారులో నుంచి శోభ వింటూ స్వప్న ఆంటీని నమ్ముకుంటే ఈ పెళ్లి ఆగేటట్టు లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో నిరూపం, సౌర్య దగ్గరికి వెళ్లి "బాధపడొద్దు సౌర్య, ఇది మన చేతుల్లో లేదు వచ్చే జన్మంటూ ఉంటే నీ ప్రేమని నేను ఎలాగైనా గెలిపిస్తాను" అని చెప్తాడు. అలాగే నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అని అడుగుతాడు.
 

పెళ్లికి ముందే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా డాక్టర్ సాబ్? అని అంటుంది శౌర్య. నేను అలా అంటాన శౌర్య? శోభ, మా మమ్మీ ఈ పెళ్లిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. నువ్వు ఒక్కదానివే వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వగలవు. కనుక నువ్వే నాకు ,హిమకి దగ్గరుండి పెళ్లి చేయాలి .ఈ మాట నీకు బాధగానే ఉండొచ్చు కానీ ఇది నా యొక్క కోరిక అని సౌర్య చేయి పట్టుకొని బతిమిలాడతాడు నిరుపమ్. చేసేదేమీ లేక ఈ పెళ్లయితే ఒక పని అయిపోతుంది. వాళ్లు సంగతి నేను చూసుకుంటాను అని నిరూపమ్ కి హామీ ఇస్తుంది శౌర్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!