PM Modi: వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న ప్రధాని మోడీ

Published : May 08, 2024, 10:33 AM IST
PM Modi: వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్న ప్రధాని మోడీ

సారాంశం

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ నేడు వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. వేముల వాడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీకి ఆలయ అధికారులు, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేములవాడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన నరేంద్ర మోదీ తొలుత ఆలయాన్ని దర్శించుకున్నారు. 

PM Modi: ప్రధాని మోడీ నేడు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ప్రధాన ఆలయంలో ప్రత్యేక నిర్వహించిన అనంతరం కోడె మొక్కులు కూడా మోదీ చెల్లించుకున్నారు. ఆలయంలోకి వస్తున్న సమయంలో ప్రధాని మోడీ క్యూలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సమయంలో ఆలయ అధికారులు, పూజారులు మోదీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రధానిమోడీని శాలువాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల ప్రత్యేక ఆశీర్వాదాలు  తీసుకున్నారని ప్రధాని మోడీ. మోదీ రాకతో ఆలయంవద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఆలయ దర్శనం అనంతరం వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభతో పాటు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. తొలుత బండి సంజయ్ కు మద్దతుగా మోడీ బహిరంగ సభలో పాల్గొని ఆ తరువాత  వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు ఎన్నికల బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !