మే 9.. తెలుగు వెండితెరకు మ్యాజికల్ డేట్

First Published May 9, 2020, 2:41 PM IST

సినీ రంగంలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక టైటిల్‌, ఓ కాంబినేషన్, ఓ రిలీజ్‌ డేట్‌ వర్క్ అవుట్ అయితే చాలు మిగతా అంతా అదే కాంబినేషన్స్ అదే డేట్స్ ఫాలో అవుతారు. అలాంటి క్రేజీ సెంటిమెంటే మే 9. ఈ డేట్‌ న రిలీజ్‌ అయిన టాలీవుడ్‌ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

1990లో ఇదే డేట్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. చిరంజీవి సరసన శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ నేటికి 30 సంవత్సారలు అవుతుండటంతో మరోసారి అభిమానులు మెగా హిట్ ను గుర్తు చేసుకుంటున్నారు.
undefined
ఇదే డేట్‌కి 1996లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమల్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో సుకన్య, మనిషా కోయిరాలాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ అయ్యింది. రిలీజ్‌ అయిన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది.
undefined
2018లో ఇదే డేట్‌కు రిలీజ్‌ అయి సూపర్‌ హిట్ అయిన సినిమా మహానటి. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా రావటం విశేషం.
undefined
గత ఏడాది కూడా ఇదే డేట్‌కు ఓ సూపర్ హిట్ సినిమా వచ్చింది. సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. సోషల్ మేసేజ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించింది.
undefined
click me!