ఈరోజు ఎపిసోడ్ లో జానకి, గోవిందరాజులు కాళ్లు పట్టుకోవడానికి వెళ్తుండగా అప్పుడు జ్ఞానాంబ అడ్డుకుంటుంది. జానకి బాధపడుతూ ఉండగా అప్పుడు జ్ఞానాంబ చికిత డాక్టర్ గారు రాసిచ్చిన ఆయిల్ తీసుకొని వచ్చి ఆయన కాళ్లకు చేతులకు మర్దన చెయ్యి నేను వెళ్లి రాగి జావా చేసుకుని వస్తాను అనడంతో సరే అని అంటుంది. అప్పుడు జానకి మీరెందుకు అత్తయ్య గారు నేను తీసుకుని వస్తాను అనగా నేనే తీసుకుని వస్తాను అని అంటుంది జ్ఞానాంబ. దాంతో జానకి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలోనే చికిత అక్కడికి ఆయిల్ తీసుకొని రావడంతో నువ్వు వెళ్ళు, నేను మా మామయ్య గారికి సేవలు చేస్తాను అనగా వద్దులేమ్మా మల్లిక అని గోవిందరాజులు ఆపుతాడు.