కనుమరుగైన లవర్‌బాయ్స్ ఉదయ్‌ కిరణ్‌, వినీత్‌, అబ్బాస్‌, తరుణ్‌, తనీష్‌.. వీళ్లంతా చేసిన తప్పు అదేనా ?

First Published Jun 8, 2021, 9:40 PM IST

ఒకప్పుడు లవర్‌బాయ్‌గా వెలుగొంది, విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఉదయ్‌ కిరణ్‌, అబ్బాస్‌, వినీత్‌, తరుణ్‌, తనీష్‌, అర్జాన్‌ బజ్జా, వరుణ్‌ సందేశ్‌ ఇప్పుడు టాలీవుడ్‌కి దూరమయ్యారు. 
 

ఈ లవర్‌ బాయ్స్ కెరీర్‌లో జరిగిన తప్పేంటి? లవర్‌బాయ్‌ ఇమేజే వీరి కెరీర్‌ని దెబ్బతీసిందనే టాక్‌ ఉంది. కమర్షియల్‌ హీరోగా, మాస్‌ హీరోగా నిలబడలేకపోవడం కారణంతోపాటు కెరీర్‌ పరంగా చేసిన తప్పుల కారణంగా వీరంతా సక్సెస్‌ కాలేకపోయారని చెప్పొచ్చు. సరైన కథల ఎంపిక చేసుకోలేకపోవడం, కాలానుగుణంగా లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడలేకపోవడంతో వీరి సినీ లైఫ్‌ దెబ్బతిన్నదనే టాక్‌ వినిపించింది. దీంతోపాటు కొన్ని పర్సనల్‌ లైఫ్‌ కారణాలు కూడా ఉన్నాయి. మొత్తానికి వీరంతా ఇప్పుడు టాలీవుడ్ కి కనుమరుగై పోయారని చెప్పొచ్చు.
undefined
ఉదయ్‌ కిరణ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ పొందిన వారిలో మొదటి వరుసలో ఉంటారు. ఆయనకు `చిత్రం, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` చిత్రాలో లవర్‌ బాయ్‌గా విపరీతమైన క్రేజ్‌,ఇమేజ్‌ వచ్చింది. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్‌ బాయ్‌గానూ వెలిగారు. క్రమంగా సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవ్వడం, మాస్‌ హీరోగా రాణించలేకపోవడం, చిరంజీవి కూతురితో ప్రేమ వ్యవహారం వంటివన్నీ ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ని దెబ్బతీశాయి.

uday kiran

చివరికి ఆయన సక్సెస్‌లు లేక, సరైన ఆఫర్స్ లేకపోవడంతో కోలుకోలేక, మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2014జనవరి 5న ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటికే ఆయన విశితని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
undefined
లవర్‌ బాయ్‌ ఇమేజ్‌లో `ప్రేమ దేశం` హీరోలు అబ్బాస్‌, వినీత్‌లు కూడా ఉంటారు. అందులో అబ్బాస్‌ లవర్‌ బాయ్‌గా రాణించారు. ఆ తర్వాత ఆయన తెలుగులో `రాజా`, `రాజహంసా`, `కృష్ణబాబు`, `అనగనగా ఓ అబ్బాయి`, `మాధురి` వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే `నీ ప్రేమకై` సినిమాలో వినీత్‌లతో కలిసి నటించారు. అయినా సక్సెస్‌ కాలేకపోయారు. వీటితోపాటు `పొలిటికల్‌ రౌడీ`, `అనసూయ`,`చంద్రహాస్‌`, `ఇది సంగతి`, `బ్యాంక్‌`, `మారో` వంటి చిత్రాల్లో నటించాడు.
undefined
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కొన్నాళ్లకే పరిమితం కావడంతో మాస్‌ హీరోగా రాణించలేకపోవడంతో చివరికి అవకాశాలు దూరమయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగలేకపోయారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ న్యూజిలాండ్‌లో సెటిల్‌ అయ్యారు.

abbas

`ప్రేమదేశం`తో తెలుగులో పాపులర్‌ అయిన మరో హీరో వినీత్‌. ఈ సినిమాతో లవర్‌ బాయ్‌గా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా ఆయన లవర్‌ బాయ్‌ తర్వాత సినిమాలే చేయడం, మాస్‌ హీరోగా చేయలేకపోవడంతో ఎక్కువ కాలం రాణించలేకపోయారు. చివరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. కానీ మలయాళంలో స్టార్‌ హీరోగా ఎదిగిన ఆయన ఇప్పుడు అక్కడ కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. తెలుగులో పూర్తిగా కనుమరుగయ్యారు. ఇటీవల `రంగ్‌ దే` చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు.

uday kiran

`సంపంగి` చిత్రంతో ఒక్కసారిగా లవర్‌ బాయ్‌గా మంచి ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు అర్జాన్‌ బజ్వా. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత `నీ తోడు కావాలి`, `కనులు మూసిన నీవాయే`, `ప్రేమలో పావని కళ్యాణ్‌` చిత్రాల్లో హీరోగా నటించారు. కానీ ఆ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయాడు. `భద్ర`, `అరుంధతి`, `కింగ్‌`, `మిత్రుడు` వంటి చిత్రాల్లో నటించాడు. క్రమంగా తెలుగుకి కనుమరుగై పోయాడు.
undefined
లవర్‌ బాయ్స్ లో తరుణ్‌ కెరీర్‌ భిన్నమైంది. ఆయన బాలనటుడిగానే జాతీయ అవార్డులు అందుకున్నారు. అనేక నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి క్యూట్‌గా ఉంటూ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. `నువ్వే కావాలి` చిత్రంతో హీరోగా మారాడు. ఈ సినిమా జాతీయ అవార్డుని అందుకోవడం విశేషం. ఈ సినిమాతో ఒక్కసారిగా లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.
undefined
`నువ్వు లేక నేను లేను`, `నువ్వే నువ్వే`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఎలా చెప్పను`, `సోగ్గాడు` వంటి చిత్రాలతో పర్వాలేదనిపించుకున్నాడు. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని కంటిన్యూ చేశాడు. కానీ మాస్‌ హీరోగా రాణించలేకపోయాడు. పైగా ఆర్తి అగర్వాల్‌తో ప్రేమ వ్యవహారం, బ్రేకప్‌ వంటి కారణాలతో కెరీర్‌ని చిక్కుల్లో పడేసుకున్నాడు. మూడేళ్ల క్రితం వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన తరుణ్‌ ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేకుండా టాలీవుడ్‌కి కనుమరుగైపోయాడు.
undefined
చైల్డ్ ఆర్టిస్టుగా రాణించిన వారిలో తనీష్‌ ఒకరు. వెంకటేష్‌ `ప్రేమంటే ఇదేరా`లో నటించాడు. `నచ్చావులే` చిత్రంతో హీరోగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్నాడు. దీంతో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత `రైడ్‌`తోనూ అదరగొట్టాడు. కానీ ఆతర్వాత కెరీర్‌ గాడి తప్పింది. వరుస పరాజయాలు, లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడలేకపోవడం, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం వంటి కారణాలతో ఇప్పుడు కెరీర్‌ ఆగిపోయింది. మూడేళ్లుగా తనీష్‌ సైతం టాలీవుడ్‌కి దూరమయ్యాడు.
undefined
`హ్యాపీడేస్‌`, `కొత్త బంగారు లోకం` హిట్లతో విపరీతమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు వరుణ్‌ సందేశ్‌. ఈ సినిమాలకు లవర్‌ బాయ్‌గా ఊహించని ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్లు లేక, ఇంకా లవర్‌బాయ్‌ ఇమేజ్‌లోనే ఉండిపోవడంతో ఆడియెన్స్ చూడలేకపోయారు. దీంతో ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు పరాజయం చెందాయి.
undefined
మూడేళ్లుగా వరుణ్‌ సందేశ్‌ కూడా టాలీవుడ్‌కి దూరమయ్యారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మళ్లీ ఇప్పుడు `ఇందువదన` చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. సెకండ్‌ ఇన్నింగ్స్ లోనైనా రాణిస్తారా? లేదా? అన్నది చూడాలి.
undefined
click me!