బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్రోజుకోసంచనల ఆరోపణలుచేస్తుంది. ఈమె చాలా కాలంగాబాలీవుడ్ ప్రముఖులపైపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కంగనా సిస్టర్ రంగోలి సైతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మరియు హీరోలు, దర్శక నిర్మాతలపై తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సుశాంత్ మరణం తరువాత కంగనాకు పెద్ద సపోర్ట్వచ్చి చేరింది.
చాలా కాలంగా ఆమె చేస్తున్న యుద్ధానికి సుశాంత్ఫ్యాన్స్ మద్దతు దొరికినట్లు అయ్యింది. దీనితో ఆమె మరింత లోతుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా సుశాంత్డెత్ కేసులోడ్రగ్స్కోణం బయటపడింది. సుశాంత్కి డ్రగ్స్తెలియకుండా రియా అలవాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కొందరు డ్రగ్ డీలర్స్ తో రియా చక్రవర్తి వాట్స్అప్ చాట్ చేసినట్లు ఆధారాలుదొరికాయి.
దీనితో బాలీవుడ్డ్రగ్ కల్చర్ పై కంగనాకొన్ని సంచలవ్యాఖ్యలు చేశారు. దాదాపు 95శాతం మంది హీరోలు, హీరోయిన్స్ కి ఈ డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె చెప్పారు. పరిశ్రమలోకు చెందిన ప్రముఖులుప్రైవేట్ పార్టీలలో ఈ డ్రగ్స్ వాడుతారనిఆమె చెప్పారు.
అలాగే ఓ స్టార్ హీరోకి డ్రగ్స్ అలవాటు ఉండడంవలన ఇంటిలో అనేక సమస్యలు తలెత్తాయని చెప్పారు. దానితోఆ హీరోకిభార్య విడాకులు ఇవ్వగా, ఆ తరువాత నేను డేటింగ్ చేశానని చెప్పి సంచలనానికి తెరలేపింది. అలాగే తనకు గురువుగా చెప్పుకొనే ఓ డైరెక్టర్ కి కూడా డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె చెప్పారు.
ఆమె చెప్పిన ఆ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ అని ఈజీగా అర్థం అవుతుంది. హ్రితిక్ రోషన్2014లోభార్య సుసానా ఖాన్ నుండి విడాకులు తీసుకున్నారు. ఇక హ్రితిక్తో తనకు ఎఫైర్ ఉందని, అతను శారీరకంగా వాడుకున్నాడనికంగనారెండేళ్లున్యాయపోరాటం చేసింది. ఇక కంగనాచెవుతున్న ఆ డైరెక్టర్ మహేష్ భట్ అని టాక్.