మరొకవైపు మల్లిక ఆ రిపోర్ట్స్ తీసుకొని జానకి గదిలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జానకి గదిలోకి వెళ్లి ఆ రిపోర్ట్స్ చూడగా అక్కడ కనిపించకపోవడంతో షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్లాయి ఏమైపోయాయి అని వెతుకుతూ ఉంటుంది జానకి. కొంపతీసి మల్లిక ఏమైనా తీసి ఉంటుందా అని మల్లిక ని వెతుకుతూ బయటికి వెళ్తుంది జానకి. మరోవైపు శ్రీమంతం జరుగుతూ ఉండగా అప్పుడు జానకి, మల్లిక కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లిక ఇప్పటివరకు నాతో ఆడుకున్నావు కదా ఇకనుంచి నీతో నేను ఆడుకుంటాను చూడు జానకి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు జానకి టెన్షన్ పడుతూ ఉండగా రామచంద్ర ఏం జరిగింది అనడంతో ఏమీ లేదు అని అబద్ధం చెబుతుంది జానకి.