Guppedantha Manasu: వసుధారని బయటకు గెంటేసిన జగతి.. వసుని ప్రమాదం నుంచి రక్షించిన రిషి?

First Published Jan 19, 2023, 8:54 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని నిన్ను అని వసుధార మీదకు వెళుతుండగా ఆగండి అక్కయ్య ఆ వసుధార నేను చాలు బుద్ధి చెప్పడానికి అని అంటుంది జగతి. అప్పుడు జగతి ఏంటి వసుధార గారు రిషి సార్ తో మీకు ఏంటి పని అనగా మేడం నేను రిషి సార్ తో చాలా మాట్లాడాలి అనడంతో ఫస్ట్ వెళ్ళిపో వసుధార అంటుంది జగతి. మేడం నేను రిషి సార్ తో మాట్లాడాలి అనగా ఎప్పుడో వెళ్లిపోయాడు అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని తిట్టబోతుండగా వదిన గారు మీరు ఆగండి అంటాడు మహేంద్ర. ఇప్పుడు మహేంద్ర వసుధార మేడం ఇది మా ఇల్లు మా ఇంటి మ్యాటర్ మీరు వెళ్లిపోండి అని అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి అనడంతో కాలేజీలో మాట్లాడాలి అని మహేంద్ర కోపంతో మాట్లాడడంతో ఫణీంద్ర ఏం జరుగుతుంది మహేంద్ర ఎందుకు అంత కోపగించుకుంటున్నావు అంటాడు.
 

అప్పుడు జగతి వసుధార గారు మీరు వెళ్లిపోండి అనడంతో ఎందుకు మేడం మీరు గారు అని పిలుస్తున్నారు అని అంటుంది. చేతులు జోడించి అడిగి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లిపోండి అని అంటుంది జగతి.  కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అనగా ఏంటి మేడం ఇలా చేస్తున్నారు అంటుంది. ఇప్పుడు పనింద్ర ఇప్పటివరకు చేయాల్సింది చేసావు ఇకపై మా ఇంటికి రావద్దమ్మా వెళ్ళిపో అని కూల్ గా మాట్లాడుతాడు. రిషి సార్ ఎక్కడున్నారో చెప్పండి సార్ అనగా ఎక్కడికి వెళ్లాడో తెలియదు తెలిసిన చెప్పము అని గట్టిగా అరిచి వసుని బయటకు గెంటేస్తుంది జగతి. అప్పుడు జగతి ముఖం మీద తలుపులు వేయడంతో వసుధర బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
 

ఆ తర్వాత వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మ నీ దగ్గరికి రప్పించుకోవడానికి నాకు కష్టాలు తెప్పిస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మ అని అడుగుతూ ఉంటుంది వసుధార. అప్పుడు తాళిబొట్టు చూపించుకుంటూ ఇది రిషి సార్ కట్టలేదు. రిషి సార్ కట్టినట్టు ఊహించుకొని నేనే కట్టుకున్నాను నా మనసు ఇది రిషి సార్ కట్టాడని చెబుతోంది అని బాధతో మాట్లాడుతుంది వసుధార. మరొకవైపు రిషి వసుధార అసలు ఏం చేశావు నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఎన్నో మాటలు చెప్పావు, ఎన్నో అందమైన జ్ఞాపకాలు అందించావు అనుకుంటూ అమ్మవారి దగ్గరికి వస్తాడు రిషి. అక్కడ వసుధారని చూసి షాక్ అవుతాడు రిషి. అప్పుడు రిషి ని చూసి వసుధర ఆనంద పడుతూ ఉంటుంది.

అప్పుడు రిషి వసుధార మెడలో తాళి చూసి అక్కడ నుంచి వెళ్లిపోతుండగా మళ్లీ వెనక్కి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటాడు. అప్పుడు తన పెళ్లి గురించి వసుధార అసలు నిజం చెప్పడానికి ప్రయత్నించగా రిషి మాత్రం మాటలు పట్టించుకోడు. అసలు నీ పెళ్లి గురించి నాకు ఏమీ చెప్పొద్దూ అసలు ఎందుకు వచ్చావో తెలియదు అని కోపంగా మాట్లాడుతాడు. ఆ తర్వాత రిషి ఎక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఇంతలో పూల ఆమె అక్కడికి వచ్చి ఏంటి సార్ బాగున్నారా నా దగ్గర పూలు తీసుకోకుండా వెళ్తారా మీతో పాటు అమ్మాయి గారు కూడా వచ్చారు పూలు తీసుకోండి అనగా రిషి పూలు తీసుకుంటాడు. అప్పుడు రిషి ఆ పూలను అమ్మవారి దగ్గర పెట్టమని చెప్తాడు.
 

అప్పుడు వసుధార ఆ పూలు తీసుకోవడంతో వసుధార మనసులో ఏముంది పెళ్లి చేసుకుంది కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటాడు రిషి. తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఒక చోట కారు ఆపి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసు ఆ పూలు చూస్తూ ఇది నాకు రిషి సార్ ఇచ్చిన కానుక అనుకుంటూ అవి చూస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇంతలోనే వసుధార ఎదురుగా బస్సు వస్తున్న పట్టించుకోకుండా అలాగే వెళుతుండగా ఇంతలో రిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వసుధారని పక్కకు లాగి చూసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు రిషి, వసు కోసం క్యాబ్ బుక్ చేస్తాడు.

 నీ కోసం క్యాబ్ వచ్చింది ఎక్కడికి వెళ్లాలో  అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఇది వసుధార ఎంత పిలుస్తున్న పట్టించుకోకుండా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు చక్రపాణి,సుమిత్ర కోసం ప్రేమగా కాఫీ తీసుకుని రావడంతో మీరు నాకు సేవలు చేయడం ఏంటండీ అని అంటుంది. ఇన్ని రోజులు ఈ రాక్షసుడికి నువ్వు సేవలు చేశావు కదా ఇప్పుడు నాకు ఆ భాగ్యం లభించింది ఏం కాదులే సుమిత్ర అనగా సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నీ ఆరోగ్యం బాగా అవుతుంది నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అనడంతో సుమిత్ర సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఇల్లు సరిగా లేదు అని చక్రపాణి చీపురు తీసుకొనీ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాడు. అది చూసి సుమిత్ర సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు పుష్ప వసుధర ఇద్దరు కలిసి పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్లడంతో థాంక్స్ పుష్ప నా కోసం ఇంత చేస్తున్నావు అంటుంది వసుధర. ఇంతలోనే సుమిత్ర వసుధార కి ఫోన్ చేయగా ఎలా ఉన్నావు అనడంతో బాగానే ఉన్నాను అమ్మ మీ నాన్న కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది.

click me!